SPIDER-MAN : ACROSS THE SPIDER-VERSE REVIEW : ఈ యానిమేటెడ్ స్పైడర్ మాన్ మూవీ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

SPIDER-MAN : ACROSS THE SPIDER-VERSE REVIEW : ఈ యానిమేటెడ్ స్పైడర్ మాన్ మూవీ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Anudeep

Ads

మనదేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న సూపర్ హీరోల్లో స్పైడర్‌మ్యాన్ ముందంజలో ఉంటాడు. యానిమేటెడ్ సిరీస్ అయినా, లైవ్ యాక్షన్ సినిమాలు అయినా స్పైడర్ మ్యాన్ పాత్రకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. 2018లో బ్లాక్ స్పైడర్ మ్యాన్ అయిన మైల్స్ మోరాలెస్ పాత్రతో పూర్తిస్థాయి థియేట్రికల్ యానిమేటెడ్ మూవీ అయిన ‘స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్’ సినిమాను రూపొందించింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్‌గా ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందొ చూద్దాం..

Video Advertisement

 

 

  • చిత్రం : స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్
  • నటీనటులు : మీక్ మూర్, హైలీ స్టెయిన్‌ఫెల్డ్, ఆస్కార్ ఐజాక్, కరణ్ సోని, బ్రియాన్ టైరీ హెన్రీ, లూనా లారెన్ వెలెజ్, జేక్ జాన్సన్
  • నిర్మాత : అవి అరద్, అమీ పాస్కల్, ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మల్లర్ , క్రిస్టినా స్టెయిన్‌బర్గ్
  • దర్శకత్వం : జోక్విమ్ డాస్ శాంటోస్, కెంప్ పవర్స్ మరియు జస్టిన్ కె. థాంప్సన్
  • సంగీతం : డేనియల్ పెంబర్టన్
  • విడుదల తేదీ : జూన్ 1, 2023

Spiderman - across the spider verse movie-story-review-rating

కథ :

‘స్పైడర్‌మ్యాన్: ఇన్‌టూ ది స్పైడర్‌వర్స్’ కథ ముగిసిన కొన్నాళ్ల తర్వాత దీని కథ ప్రారంభం అవుతుంది. వేరే విశ్వంలో ఉండే స్పైడర్ ఉమెన్/గ్వెన్ స్టేసీకి ఒక సమస్య రావడంతో తను స్పైడర్ సొసైటీలో చేరుతుంది. అన్ని విశ్వాల్లోని స్పైడర్ మ్యాన్/ఉమెన్‌లను ఒక చోట చేర్చి విశ్వాలను కాపాడటం ఈ స్పైడర్ సొసైటీ బాధ్యత.

Spiderman - across the spider verse movie-story-review-rating

అనుకోకుండా తను మళ్లీ మైల్స్ మోరాలెస్/స్పైడర్ మ్యాన్ జీవితంలోకి వస్తుంది. మైల్స్ మోరాలెస్‌కి, ‘స్పాట్’ అనే సూపర్ విలన్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? ఇతర విశ్వాల్లోని లెక్క లేనంత మంది స్పైడర్ మ్యాన్‌లు ఎందుకు మైల్స్ వెంట పడ్డారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

 

రివ్యూ:

దీనికి ముందు వచ్చిన మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలుసు అందులో ఎలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ చిత్రంలో కూడా ఆ స్పైడర్ సొసైటీ థీమ్ ఆకట్టుకుంటుంది. అయితే కథలోకి వెళ్లడానికి కూడా దర్శకులు కొంచెం సమయం తీసుకుంటారు. మొదటి 45 నిమిషాలు గ్వెన్ స్టేసీ, మైల్స్ మోరాలెస్‌ల వ్యక్తిగత జీవితాల చుట్టూనే కథ తిరుగుతున్నట్లు, కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది.

Spiderman - across the spider verse movie-story-review-rating

పవర్ ఫుల్ విలన్ ‘స్పాట్’ను మొదటి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. నిజానికి ఈ సినిమా కూడా ‘స్పాట్’ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అత్యంత బలహీనంగా ‘విలన్ ఆఫ్ ది వీక్’ అని మైల్స్ మోరాలెస్ ఎగతాళి చేసే స్పాట్, అన్ని విశ్వాలకు ప్రమాదకరంగా ఎలా మారాడో చూపించే విధానం ఆకట్టుకుంటుంది. ‘పవిత్ర ప్రభాకర్’ అనే ప్రత్యేక భారతీయ స్పైడర్ మ్యాన్ రో‌ల్‌ను కూడా క్రియేట్ చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ కథను మలుపు తిప్పుతుంది.

Spiderman - across the spider verse movie-story-review-rating

సినిమాలో చివరి గంట చాలా రేసీగా సాగుతుంది. ముఖ్యంగా స్పైడర్ సొసైటీలో మైల్స్ మోరాలెస్‌కు, మిగతా స్పైడర్ మ్యాన్లకు వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. అక్కడి నుంచి తర్వాతి భాగానికి బేస్‌ను చాలా బలంగా సెట్ చేశారు. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ తర్వాతి భాగం మీద ఆసక్తిని మరింత పెంచుతుంది.

Spiderman - across the spider verse movie-story-review-rating

విజువల్‌గా ‘స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్’ ఒక పెయింటింగ్‌ అని చెప్పవచ్చు. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. డేనియర్ పెంబెర్టన్ ఇచ్చిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. మార్వెల్ స్టూడియోస్ వారి ప్రొడక్షన్ హై లెవెల్ లో ఉంది. యానిమేషన్ టీం వర్క్ చాలా బాగుంది.

ప్లస్ పాయింట్స్:

  • మూవీ థీమ్
  • విజువల్స్
  • డైలాగ్స్

Spiderman - across the spider verse movie-story-review-rating

మైనస్ పాయింట్స్:

  • బలమైన స్టోరీ లేకపోవడం
  • స్క్రీన్ ప్లే
  • తగ్గిన కామెడీ సీన్స్

రేటింగ్:

3 /5

ట్యాగ్ లైన్:

“స్పైడర్ మ్యాన్ – అక్రాస్ ది స్పైడర్ వెర్స్” విజువల్ గా ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది. స్పైడర్ మాన్ ఫాన్స్ ఖచ్చితంగా చూడాల్సిందే.

Watch trailer: 


End of Article

You may also like