శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదు అంటారు…దానికి వెనకున్న 3 కారణాలు ఇవే.!

శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదు అంటారు…దానికి వెనకున్న 3 కారణాలు ఇవే.!

by Megha Varna

Ads

శ్రావణ మాసాన్ని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు.ఈ మాసం శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం.ఈ మాసంలో హిందువులందరూ మాంసాహారం తినరు.దీనికి ఆధ్యాత్మిక కారణమే కాకుండా సైంటిఫిక్ కారణం కూడా ఉంది.అవేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1. శ్రావణ మాసంలో ప్రతిరోజూ ప్రతివారం విశిష్టమైందే

సాధారణంగా శ్రావణ మాసంలో ప్రతిరోజూ ప్రతివారం విశిష్టమైందే అందుకే హిందువులు ఈ మాసంలో మాంసాహారం జోలికి వెళ్ళరు.ఈ మాసంలో హిందువులు ప్రతివారం ఓ పూజను నిర్వహిస్తారు.ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం.

సోమవారం : శివ పూజ

మంగళవారం : మంగళ గౌరీ పూజ

బుధవారం : బుధ పూజ

గురువారం : బృహస్పతి పూజ

శుక్రవారం : జర జివంతిక పూజ

శనివారం : అశ్వత్ మారుతీ పూజ

ఇక ఈ మాసంలో ఎందుకు మాంసాహారం తినకూడదని సైన్స్ చెబుతుందో చూద్దాం.

#2. ఈ మాసంలో భారీగా వర్షాలు పడతాయి. ఈ సమయంలో మాంసాహారం తింటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.పైగా ఈ మాసంలో మనుషులలో ఇమ్యూనిటీ లెవెల్ చాలా తక్కువగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ఈ మాసంలో ఖచ్చితమైన ఆహారం తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

#3. ఇక ఈ మాసంలో జంతువులలో బ్రీడింగ్ ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల కడుపుతో ఉన్న జీవులను చంపకూడదని మన పెద్దలు ఈ టైంలో జంతువులను తింటే ఎకో బ్యాలన్స్ దెబ్బతింటుందని సైంటిస్ట్స్ లు చెబుతున్నారు.మరి ఇది శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడానికి కారణం.ఇక శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదని వాదించే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కు ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి.


End of Article

You may also like