Ads
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న శ్రీజ ఏ పోస్ట్ చేసినా అది వెంటనే వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీజ కుటుంబసభ్యులతో కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
Video Advertisement
తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో తాను చెప్పిన విషయాలు.. తన కూతురు చాటింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. తనకు జన్మనిచ్చిన తల్లికి గుడ్ మార్నింగ్ (గుడ్డు, సూర్యుడు ఉన్న ఎమోజీలను కలిపి) అంటూ ఓ మెసెజ్ పెట్టింది నివృత్తి.
దానికి నవ్వుతున్న ఎమోజీని రిప్లైగా ఇచ్చింది శ్రీజ. అయితే ఎమోజీని షేర్ చేయడం నివృత్తికి నచ్చనట్టుంది. అమ్మా నేను నీకేం నేర్పించానో మరిచిపోయావా? ఆ ఎమోజీ నాకు నచ్చలేదు, బాగా లేదు (నాట్ కూల్) అన్నట్టుగా మెసెజ్ పెట్టేసింది నివృత్తి. మళ్లీ రిప్లై ఇవ్వు అమ్మా అంటూ మెసెజ్ పెట్టింది. మేం అంతా కూడా పాతకాలం మనుషులం కదా? అని శ్రీజ రిప్లై ఇవ్వడంతో… హ..హ.. అని నివృత్తి నవ్వుతున్నట్టుగా మెసెజ్ పెట్టేసింది.
ఇలా మొత్తానికి ఈ తల్లీకూతుళ్లు పొద్దున్నే చాటింగ్ చేసేసుకున్నారు. ఇప్పుడు శ్రీజ తన పిల్లలతోనే కలిసి ఉంటోంది. నివృత్తి, నవిష్క ఇద్దరూ కూడా శ్రీజతోనే ఉంటున్నారు. కళ్యాణ్ దేవ్ వీరికి దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలా ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, ఆల్రెడీ విడాకులు కూడా తీసుకున్నారంటూ రకరకాలుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి.
End of Article