అప్పుడు ఆర్తి అగర్వాల్… మొన్న కృతి శెట్టి… ఇప్పుడు శ్రీలీల..! ఇదే తప్పు చేశారా..?

అప్పుడు ఆర్తి అగర్వాల్… మొన్న కృతి శెట్టి… ఇప్పుడు శ్రీలీల..! ఇదే తప్పు చేశారా..?

by Mounika Singaluri

Ads

శ్రీలీల ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక సెన్సేషనల్ హీరోయిన్.జనాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. తన అద్భుతమైన డ్యాన్సులతో, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో యూత్ కి బాగా దగ్గరయింది.

Video Advertisement

అయితే ప్రస్తుతం శ్రీ లీల చేస్తున్న సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు శ్రీ లీలను చూస్తుంటే అప్పట్లో ఆర్తి అగర్వాల్, తాజాగా కృతి శెట్టిని చూసినట్లు ఉందని అభిమానులు చెబుతున్నారు.

Aarthi Agarwal story

అప్పట్లో ఆర్తి అగర్వాల్ కూడా బిజీ హీరోయిన్ గా ఉండేది. తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది పట్టించుకోకుండా ప్రతి సినిమా చేసేది. అలా ఒక దశకు వచ్చేసరికి ఆమె చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయి ఫెడ్ అవుట్ అయిపోయింది.తాజాగా కృతి శెట్టి పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఉప్పెన సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయ్యి మొదటి సినిమా తోటి బ్లాక్ బస్టర్ కొట్టింది.

kritishetty make her remunaration down..!!

తర్వాత వరస పెట్టి సినిమాలు ఒప్పుకుంది. ఒక దశకు వచ్చేసరికి ఆమె చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. కథ గురించి పట్టించుకోకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేసింది. ఫలితంగా ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంది. సేమ్ ఇదే తరహాలో శ్రీలీల కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కేవలం డ్యాన్సులు కోసమే శ్రీ లీలను సినిమాలోకి తీసుకుంటున్నారు. ఆమె క్యారెక్టర్ కి పెద్దగా ప్రాధాన్యం ఉండడం లేదు. తాజాగా బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాలో నటించిన కూడా క్రెడిట్ అంతా బాలకృష్ణకే వెళ్లిపోయింది. ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా కూడా బిలో యావరేజ్ టాక్ ను తెచ్చుకుంది.ఇక ముందు ముందు వచ్చే సినిమాలు ఫలితం మీద  శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఆర్తి అగర్వాల్, కృతి శెట్టికి వచ్చిన పరిస్థితే వస్తుంది.

 

Also Read:నాని నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఇతనేనా..? 2022 లో సూపర్ హిట్ కొట్టాడు..!


End of Article

You may also like