Home Filmy Adda రెండోసారి పిలిచినా “జబర్దస్త్” కు NO చెప్పిన ఆ టాప్ యాంకర్ ఎవరో తెలుసా.? కారణం అదేనా.?

రెండోసారి పిలిచినా “జబర్దస్త్” కు NO చెప్పిన ఆ టాప్ యాంకర్ ఎవరో తెలుసా.? కారణం అదేనా.?

by Anudeep

తెలుగు టీవీ ప్రేక్షకులకు కామెడీ షో అంటే వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ ప్రోగ్రాం. మొదట్లో జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లు కమెడియన్స్ తో, కామెడీ స్కిట్లతో కలకల్లాడేవి. కానీ ఈ షో పూర్వ వైభవాన్ని క్రమేపి కోల్పోతూ వస్తుంది. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమీడియన్స్ అందరూ బుల్లితెర ను వదిలి సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ప్రాముఖ్యత ఇవ్వడంతో ఈ షో వెలవెలబోతుంది.

అంతే కాకుండా షో నిర్వాహకుల మధ్య ఉన్న అనేక విభేదాల కారణంగా కమెడియన్లు షో ను వదిలి వెళ్ళిపోతున్నారు. అది కాక ఈమధ్య ఈ షోపై నెగటివ్ కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ అనసూయ కూడా షో ని వదిలి వెళ్ళిపోవడంతో జబర్దస్త్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అనసూయ తర్వాత ఈ షో హైప్ ని పెంచడం కోసం సరికొత్త యాంకర్ ని రంగంలోకి దించుతున్నారని వార్తలు వచ్చాయి.

reason behind anasuya opting out from jabardast

ఈ నేపథ్యంలో పలువురు టాప్ యాంకర్లను ఈ షో కోసం సంప్రదించగా వాళ్ళు నిరాకరించినట్టు సమాచారం. మొట్టమొదట శ్రీముఖి నే ఈ షో కు యాంకర్ గా చేయమని అడిగారు. 2013లో ఒకసారి జబర్దస్త్ ప్రోగ్రాం యాంకర్ గా చేయను అని నిరాకరించిన శ్రీముఖి తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు.

ఈ కారణం చేత ఇప్పుడు జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షో లకు రష్మీ నే తీసుకోవడం జరిగింది. అయితే రెండుసార్లు శ్రీముఖి ఈ షో ని ఎందుకు నిరాకరించింది అనే అంశంపై నెట్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. కాగా దానికి అసలు కారణం తను అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోవడం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

You may also like