Sreenuvaitla: శ్రియ తో ఆ ఛాన్స్ దొరకలేదు.. వైరల్ అవుతున్న శ్రీనువైట్ల కామెంట్స్..!

Sreenuvaitla: శ్రియ తో ఆ ఛాన్స్ దొరకలేదు.. వైరల్ అవుతున్న శ్రీనువైట్ల కామెంట్స్..!

by Anudeep

Ads

టాలీవుడ్ నటి శ్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ఇష్టం” సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అప్పట్లో చాల మంది యువతకి క్రష్ గా ఉన్నారు. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ తరగని అందం ఆమెది. చిన్న వయసులోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు మూటగట్టుకున్నారు. ఇప్పటికీ ఆమె ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ నటిగా తన సత్తా చాటుతున్నారు.

Video Advertisement

sriya

తాజాగా.. ఆమె గురించి దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేసారు. నిజానికి శ్రియ ను దర్శకుడు శ్రీనువైట్ల ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యాలని అనుకున్నారట. “ఆనందం” సినిమా కోసం హీరోయిన్ ను వెతుకుతున్న టైం లో మ్యాగజైన్ లో శ్రియ ను చూశామని, ఆమె కాంటాక్ట్ వెతికిపట్టుకుని సంప్రదించామని చెప్పుకొచ్చారు.

srinuvaitla

శ్రియ కూడా సినిమాల్లోకి రావడానికి ఇంటరెస్ట్ చూపించడం తో ఆనందం సినిమా కి హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. కానీ ఈ సినిమా ఆలస్యమైంది. ఈలోపు రామోజీరావు శ్రియ ను చూసి.. “ఇష్టం” సినిమా కోసం అడిగారు. అలా శ్రియ ఫస్ట్ మూవీ “ఇష్టం” అయింది. అయితే శ్రీనువైట్ల మాత్రం ఆమె ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ దొరకలేదు అంటూ చెప్పుకొచ్చారు.


End of Article

You may also like