PINDAM REVIEW : “శ్రీరామ్” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

PINDAM REVIEW : “శ్రీరామ్” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by kavitha

Ads

రోజా పూలు, ఒకరికి ఒకరు సినిమాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హీరో శ్రీరామ్, ఆ తరువాత ఆడవారి మాటలకు అర్థాలేవేరులే, నిప్పు, టెన్త్‌ క్లాస్ డైరీస్‌ వంటి సినిమాలలో కీలక పాత్రలలో అలరించారు. శ్రీరామ్‌ నటించిన లేటెస్ట్ హార్రర్ మూవీ పిండం ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఎలా ఉందో చూద్దాం..

Video Advertisement

  • చిత్రం : పిండం
  • నటీనటులు : శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్ తదితరులు
  • నిర్మాత : యశ్వంత్ దగ్గుమాటి
  • దర్శకత్వం : సాయికిరణ్ దైదా
  • సంగీతం : కృష్ణ సౌరబ్ సూరంపల్లి
  • విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023

స్టోరీ:

ఆంథోని (శ్రీరామ్) ఒ రైస్ మిల్లులో అకౌంటెంట్.  అతనికి  భార్య (ఖుషి రవి). ఇద్దరు పిల్లలు సోఫీ (లీషా సూరంపూడి),  తార (చైత్ర పెద్ది). ఆంథోని ఒక పురాతనమైన ఇంటిని కొంటాడు. ఆ తరువాత తల్లి సూరమ్మ, భార్య, పిల్లలతో కలిసి ఆ ఇంట్లోకి మారతారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి వారికి సమస్యలు ప్రారంభం అవుతాయి. ఆంథోని చిన్న కుమార్తెలో చాలా మార్పు వస్తుంది. ప్రెగ్నెంట్  అయిన ఆంథోని భార్య హాస్పటల్ పాలవుతుంది. అతని తల్లికి కూడా ప్రమాదం జరుగుతుంది. వారికి ఎదురైన సమస్యలకు కారణం ఏమిటి? వాటి వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటి? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొన్నాడు? ఆంథోని తన ఫ్యామిలిని ఎలా రక్షించాడు అనేది మిగిలిన కథ.రివ్యూ:

డైరెక్టర్ సాయికిరణ్ ఎంచుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుంది. ఎమోషనల్ గా సాగే క్యారెక్టర్లకు సెలెక్ట్ చేసుకున్న నటీనటులు ఈ చిత్రానికి బలం అని చెప్పవచ్చు. ప్రధమార్ధంలో మూవీని గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌ చూపిస్తూనే,  కొన్ని సన్నివేశాలలో భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇవి భయాందోళన కలిగిస్తాయి. అందువల్లే ఈ మూవీ యూనిట్ గర్భీణీలు, చిన్నపిల్లలు చూడకూడదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ చిత్రానికి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగుంది.  సెకండాఫ్ ను ఫస్టాఫ్ లానే నడిపించారని చెప్పవచ్చు. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు రోటీన్ గా అనిపించినా, ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.
నటీనటుల విషయానికి వస్తే, శ్రీరామ్ ఇప్పటి వరకు గ్లామర్ మరియు యాక్షన్ హీరోగానే నటించారు. ఈ మూవీలో ఢిఫరెంట్ లుక్, నటనతో ఆకట్టుకున్నారు. ఎమోషనల్ సీన్స్ లో శ్రీరామ్ నటన బాగుంది. ఆంథోని భార్య పాత్రలో నటించిన ఖుషి రవి ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆంథోని పిల్లలుగా నటించిన ఇద్దరు చక్కగా నటించారు. ముఖ్యంగా తార గా నటించిన చైత్ర పెద్ది అద్భుతంగా నటించింది. అన్నమ్మగా కీలక పాత్ర చేసిన ఈశ్వరీ రావు నటన ఈ సినిమాకి మేజర్ అస్సెట్ గా నిలిచింది.  అవసరాల శ్రీనివాస్ పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండిపోయేలా నటించారు.
ప్లస్ పాయింట్స్ :

  • సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ,
  • అన్నమ్మ క్యారెక్టర్,
  • ప్రీ-క్లైమాక్స్,
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,
  • పిల్లల నటన

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ,
  • సెకండ్ ఆఫ్ ల్యాగ్,

రేటింగ్ :

2.75/5

ట్యాగ్ లైన్ :

హారర్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ తో తెరకెక్కిన సినిమా పిండం. హారర్‌ సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను  ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.

watch trailer :

Also Read: హాయ్ నాన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్….

 


End of Article

You may also like