హాయ్ నాన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్….

హాయ్ నాన్న మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్….

by Mounika Singaluri

నాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ మూవీ డీసెంట్ హిట్ గా నిలిచింది. తండ్రి కూతురు సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు.

Video Advertisement

ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రల్లో కనిపించారు.

hi nanna censor talk

ప్రయోగాలు చేయడంలో నాని ని మించిన హీరో వేరే ఒకరు లేరు. అలాగే కొత్త దర్శకులను పరిచయం చేయాలన్న నాని తర్వాతే ఎవరైనా సరే. అలా కొత్త వాళ్లను నమ్మి సినిమా చేసిన ప్రతిసారి నానికి హిట్టు దక్కింది. అయితే హాయ్ నాన్న మూవీ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. ఒకసారి ఈ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే…

ఈ మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి రూ. 27.60 కోట్లు బిజినెస్ జరిగింది.అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బుధవారం రూ. 65 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1 కోటి వరకూ షేర్ వచ్చింది. ఇలా వారం రోజుల్లో ఈ చిత్రం విజయానికి చేరువగా వచ్చేసింది


You may also like

Leave a Comment