Ads
సుశాంత్ సింగ్ రాజపుత్ యంగ్ బాలీవుడ్ హీరో బలవన్మరణం పొందాక…ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.ఒక అగ్ర హీరో స్థాయికి చేరాల్సిన వ్యక్తి ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం..ఏ మాత్రం నచ్చట్లేదు ఫాన్స్ కి..బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సుశాంత్ కి భారీగానే ఫాన్స్ ఉన్నారు..సినీ ఫాన్స్ నుంచి స్టార్స్ వరకు..సుశాంత్ మరణం పై చాల మంది ఇప్పటికే స్పందించారు,స్పందిస్తూనే ఉన్నారు ఇప్పటికీ.
Video Advertisement
బాలీవుడ్ లోని పెద్దలు పైకి ఎదగనివ్వకుండా చేసారని నేపోటిజం వలెనే అయన మరణానికి కారణం అంటూ వాపోతున్నారు.అదలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి మరో సారి ఒక ఎమోషనల్ పోస్ట్ ని పెట్టారు.వివాదాల శ్రీరెడ్డి..ఎలాంటి పోస్ట్ చేసిన ఫాన్స్ నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంటుంది….ఆమె దాదాపుగా ట్రోల్ల్స్ చేస్తూ ఉన్న పోస్టులు ఎక్కువగా ఉంటాయి.యాక్టర్స్ నుంచి పోలిటేషన్స్ వరకు…తన కోపాన్ని చూపించే శ్రీరెడ్డి…ఈసారి మాత్రం ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ALSO READ : బాలయ్య..చెంప మీద కొడతాడు..కానీ మెగా ఫామిలీ’.. .అంటూ బాలయ్య బర్త్డే మీద శ్రీరెడ్డి పోస్ట్
అదేమనగా..‘సుశాంత్ మరణానికి సంబంధించిన వీడియోలు తెలియకుండానే నన్ను డిప్రెషన్‌కు గురయ్యాను. వ్యక్తిగతంగా నేను కూడా ఈ లాక్ డౌన్‌లో ఎన్నో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ చవిచూశాను. పైగా చెన్నై పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎంతోమంది అమాయకులు, కల్నల్ సంతోష్ బాబు వంటి వారు చనిపోతున్నారు.. మీతో టచ్‌లో ఉండటానికి నా టీమ్ పాత వీడియోలను పోస్ట్ చేసింది. నేను మళ్లీ త్వరలోనే మీ ముందుకు వస్తాను’.
నిజానికి..శ్రీరెడ్డి చెప్పింది నిజమే. ఈసంవత్సరం అంతగా ఎవరికీ కలిసి రాలేదు అనే చెప్పాలి. ఒక వైపు కరోనా మరోవైపు దేశ సరిహద్దుల్లో చైనా తో యుద్ధ వాతావరణంబాలీవుడ్ లో హీరో సుశాంత్ మరణం.ఇంకా ఎలాంటి వార్తలు వినాలో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు…కనీసం 2021 అయినా బాగుండాలి అని ఆశిద్దాం.
End of Article