స్టేజ్ పైనే ఏడ్చేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య..! ఏం జరిగిందంటే..?

స్టేజ్ పైనే ఏడ్చేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

జబర్దస్త్ కామెడీ షో, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు నడుస్తున్న సమయంలోనే మల్లెమాల ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే షోను మొదలుపెట్టింది. ఈ షో ద్వారా ఎక్కడెక్కడో ఉన్నవారి ప్రతిభను వెలుగులోకి తెచ్చే ఒక వేదికను ఏర్పాటు చేసి, ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ వస్తుంది.

Video Advertisement

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జబర్దస్త్ యాంకర్ అయిన సౌమ్య రావు తన తల్లి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
sowmya-rao-emotionalహైపర్ ఆది మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీషోలో ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమోలో తనదైన పంచులతో నవ్వించాడు. హైపర్ ఆది ఈ ఎపిసోడ్ లో పెళ్లి చూపుల థీమ్ తీసుకున్నాడు. పెళ్లి చూపులకి ఆర్టిస్టులంతా కలిసి తన కుటుంబంలా  వచ్చారని అనడంతో మొదలైన ప్రోమో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా  సాగిపోయింది. ‘ఊ అంటావా మావ’ సింగర్ ఇంద్రావతి చౌహన్ పాడిన ఫోక్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.
ఆది రెయిన్ డ్యాన్స్ చేశాడు. జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుతో కలిసి ‘వాన వల్లప్ప వల్లప్ప’ పాటకి స్టెప్పులు వేశాడు. అయితే ప్రోమో చివర్లో ఆది సౌమ్య రావు కోసం ఒక  గిఫ్ట్ తెచ్చానని చెప్పి, గిఫ్ట్ ఇస్తాడు. సౌమ్య గిఫ్ట్ కవర్ తెరచిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది. సౌమ్య రావ్ తన తల్లితో ఉన్న ఫోటోను ఆది ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. అప్పుడు ఆమె తల్లి ఫోటోలను ప్లే చేయడంతో వాటిని చూసిన సౌమ్య తన తల్లి గురించి చెప్తు బోరున ఏడ్చేసింది.
అమ్మకి విపరీతమైన తలనొప్పి వచ్చిందని, హాస్పిటల్‌కి తీసుకెళ్లడంతో డాక్టర్లు బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు.  అమ్మ తనెవరో తెలియనంతగా గతాన్ని మర్చిపోయిందని చెప్పింది. మూడున్నర ఏళ్లు అమ్మని బెడ్ మీదనే చూసుకున్నానని, దేవుడు అమ్మకి అలాంటి స్థితి ఇస్తాడని అనుకోలేదని, తన తల్లి మళ్లీ తన కడుపున జన్మించాలని  అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకోవడంతో ఇంద్రజ ఆమెను ఓదార్చారు.

Also Read: నాగ శౌర్య “రంగబలి” రెస్పాన్స్ ఎలా ఉందంటే..?


End of Article

You may also like