“పుష్ప రాజ్” లాంటి సేమ్ డిఫెక్ట్ ఉన్న రోల్… అంతకుముందే “శ్రీహరి” చేసారా..? ఏ సినిమాలో అంటే..?

“పుష్ప రాజ్” లాంటి సేమ్ డిఫెక్ట్ ఉన్న రోల్… అంతకుముందే “శ్రీహరి” చేసారా..? ఏ సినిమాలో అంటే..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

srihari did same role as pushpa raj in an old movie

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక చేయి కొంచెం పైకి ఎత్తి నడుస్తారు. హీరో అలా ఉండటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక పెద్ద రిస్క్ తీసుకొని సక్సెస్ అయ్యారు. అయితే పుష్ప కంటే ముందు ఇలాంటి ఒక పాత్ర శ్రీహరి గారు కూడా చేశారు. పృథ్వీ నారాయణ అనే ఒక సినిమాలో శ్రీహరి రెండు పాత్రల్లో నటించారు. అందులో ఒక పాత్ర, పుష్ప రాజ్ ఎలా అయితే ఒక చేయి కొంచెం ఎత్తి నడుస్తూ ఉంటారో, అదే విధంగా పృథ్వీ నారాయణ సినిమాలో రెండు పాత్రల్లో ఒక పాత్ర కూడా అలాగే ఉంటారు. అలా చాలా కాలం క్రితం శ్రీహరి గారు కూడా దాదాపు ఇలాంటి పాత్రే పోషించారు.


End of Article

You may also like