విద్యార్థులా..?రౌడీలా..? అలా కొట్టుకుంటున్నారు ఏంటి? వైరల్ అవుతున్న వీడియో!!!

విద్యార్థులా..?రౌడీలా..? అలా కొట్టుకుంటున్నారు ఏంటి? వైరల్ అవుతున్న వీడియో!!!

by Anudeep

Ads

రౌడీ అంటే ఇక్కడ గాటు పెట్టుకుని ,మీసాలు మెలితిప్పుకుని, గల్లలుంగీ కట్టుకుని , చొక్కా వేసుకుని , మెడలో మఫ్లర్ చుట్టుకుని తెలుగు సినిమాల్లో ఉన్నట్టు ఉంటారనుకున్నారా?  కాలేజ్ స్టూడెంట్స్ అంటే బుద్దిగా కాలేజ్ కి వెళ్లి చదువుకుంటూ , పరీక్షల టైం కదా అని పరీక్షలకు ప్రిపేరవుతారనుకుంటున్నారా ? కాలేజ్ స్టూడెంట్స్ లో కూడా మీసాలు మెలి తిప్పలేని రౌడీలుండొచ్చు అని ప్రూవ్ చేశారు శ్రీకాకుళం విధ్యార్దులు . ఫైటింగులు చేయడానికి సినిమా వాళ్లకంటే మేం తక్కువ అంటూ కాలేజి ముందే వీధి రౌడీల్లా గొడవకి దిగారు .

సినిమా ఫైటింగ్‌ను తలదన్నే రేంజ్‌లో కొందరు విద్యార్థులు ఎగిరెగిరి తన్నుకుంటే , మరికొందరు భయంకరంగా పిడిగుద్దులు గుద్దుకున్నారు .చుట్టుపక్కల వాళ్లు వారిస్తున్నా వినకుండా ఒకరినొకరు భయంకరంగా కొట్టుకున్నారు . శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని ఓ కాలేజీలో జూనియర్‌ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బైక్‌తో ఢీ కొట్టడంతో  గొడవ ప్రారంభమైంది . కాలేజి ముందే ,రోడ్ పై జనం ఆపమని చెప్తున్నా వినకుండా సీనియర్స్ , జూనియర్స్ గొడవపడ్డారు.

ఈ ఫైటింగ్‌ వల్ల గంట సేపు ట్రాఫిక్ జామ్‌ అయింది . ఒకవైపు వాళ్లు గొడవ పడుతుంటే , కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. మెయిన్‌రోడ్డ వద్ద విద్యార్థులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయపడిపోయారు. వీధి రౌడీల్లా వారు కొట్టుకుంటోన్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాలకొండ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Video Advertisement

watch video:


End of Article

You may also like