Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా అప్పుడు ఎంత పెద్ద అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమా వచ్చే దాదాపు 8 సంవత్సరాలు అయ్యింది.
Video Advertisement
అయితే ఇప్పుడు ఈ సినిమా మీద గొడవలు మొదలు అయ్యాయి. ఈ సినిమా తన నవల ఆధారంగా తీసారు అని ఒక రచయిత పేర్కొన్నారు. శరత్ చంద్ర అనే ఒక రచయిత ఈ సినిమా తాను రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల ఆధారంగా తీశారు అని అన్నారు.
ఈ విషయం మీద దాదాపు 8 సంవత్సరాల నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శరత్ చంద్రకి 15 లక్షలు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయినా కూడా శరత్ చంద్ర తనకి పేరు క్రెడిట్ కావాలి అని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం మీద కొరటాల శివ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఆచార్య సినిమాలు తీశారు. ఇప్పుడు దేవర సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ పడినట్టు సమాచారం. ఇప్పుడు ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
నవలలో రాసిన సీన్స్ కూడా అందులో ఉన్నది ఉన్నట్టు కాపీ కొట్టారు అని అన్నారు. ఫైటింగ్ సీన్స్, దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఇవన్నీ కూడా నవలలో ఉన్నట్టే తీశారు అని శరత్ చంద్ర అన్నారు. ఈ విషయం మీద వార్తలు ఏమి పెద్దగా బయటికి రావట్లేదు. కానీ కొరటాల శివ మాత్రం చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు. ఇప్పట్లో ఇది తేలేలా లేదు అని కూడా అన్నారు. మరి సినిమా బృందం అందరూ కలిసి చర్చించుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటే గొడవ పరిష్కారం అవుతుంది ఏమో వేచి చూడాల్సిందే.
ALSO READ : ఇంత చిన్న ఆమెని తల్లి పాత్రలో ఎలా పెట్టారు..? జగతి మేడం రియల్ ఏజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article