ఒక్క పెళ్ళికి అన్ని వందల కోట్లా? గాలి వారికంటే ఘనంగా చేసిన వీళ్ళు ఎవరో తెలుసా?

ఒక్క పెళ్ళికి అన్ని వందల కోట్లా? గాలి వారికంటే ఘనంగా చేసిన వీళ్ళు ఎవరో తెలుసా?

by Anudeep

Ads

ఒకప్పుడు పెళ్ళంటే  “ఆత్మీయ వేడుక”. కానీ ఇప్పడు స్టేటస్ సింబల్. అప్పట్లో పెళ్లికి ఎంతమంది వచ్చారో లెక్కలేసుకుని సంతోషపడితే , ఇప్పుడు ఎంత గొప్పగా చేయాలో లెక్కలేసుకుని మురిసిపోతున్నారు. ఒకప్పుడు పెళ్లి భోజనం తినడానికి పోటీపడితే , ఇప్పుడు భోజనాల్లో ఎన్ని వెరైటీలు పెట్టాలా అని పోటీపడుతున్నారు. ఖర్చుకి వెనకాడకుండా కోట్లకి కోట్లు ఖర్చుపెడుతూ పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట అనేవి కేవలం మాటల్లోనే ఉండేవి. కానీ నిజంగానే ఆకాశమంత పందిరి, భూదేవంత పీట టైపులోనే ఇప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారు. పెళ్లి కార్డు దగ్గరనుండి అన్ని ఆడంబరమే. కేవలం ఒక పెళ్లి కార్డుకే లక్ష ఖర్చుపెట్టిన వాళ్లున్నారు. ఇక పెళ్లిల్లు కోట్లలో ఖర్చు. అలా కోట్లకు కోట్ల ఖర్చుతో సినిమాని తలపించే రేంజ్ లో జరిగినదే  గాలి జనార్దన్ రెడ్డి ఇంట పెళ్లి. అయితే ఆ రికార్డ్‌ను బీట్ చేస్తున్నారట కర్ణాటక ఆరోగ్యమంత్రి శ్రీరాములు. తన కూతురు రక్షిత పెళ్లికి  ఇఫ్పటి వరకు ఎవరూ ఖర్చుపెట్టనంత ఖర్చుతో పెళ్లి చేస్తున్నారట. ఇంతకీ ఆ పెళ్లి ఖర్చెంతంటే అక్షరాల ఆరువందల కోట్లు . వరుడు ఎవరో కాదు హైదరాబాద్ కుర్రాడే, బంజారాహిల్స్‌‌కు చెందిన పారిశ్రామికవేత్తల కుటుంబంలో వ్యక్తి.

Video Advertisement

మార్చి ఐదవ తేదీన పెళ్లికి ఫిబ్రవరి 27 నుంచే పెళ్లిసందడి స్టార్ట్ అయింది. తొమ్మిదిరోజులపాటు జరిగే ఈ వివాహ వేడుకకి  రకరకాల ఈవెంట్లతో అదిరిపోయేలా ఏర్పాట్లు ప్రోగామ్‌లు చేసారు. ఇప్పటికే పెళ్లి కూతురితో బళ్లారి నాగమ్మ గుడిలో అట్టహాసంగా పూజలు చేయించారు.  నాలుగు ఎకరాల స్థలంలో సినిమా సెట్టింగులను తలపించేలా విరూపాక్ష దేవాలయం సెట్. మెల్కోటే గుడిలోని కళ్యాణి తరహాలో పెళ్లి జరిగే వేదిక సెట్ వేశార .

పెళ్లి కూతురు మేకప్ కోసం అయితే దీపికా పదుకునేకి మేకప్ చేసే స్టైలిస్ట్‌ని రప్పిస్తే , పెళ్లి కూతురు చీర కోసం ఎన్నో తర్జన భర్జనలు పడ్డారట. పెళ్లికూతురు చీరని కన్నడ సినిమా ఇండస్ట్రీలో పేరొందిన కాస్ట్యూమ్ డిజైనర్ సానియా డిజైన్ చేసారట.  ఫోటోలు, వీడియోలు అయితే ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లికి పనిచేసిన టింని రప్పించారట .ఇక భోజనాలన్నీ ఉత్తర కర్నాటక స్టైల్  వెయ్యి మంది వంటవాళ్ల చేత చేయిస్తున్నారట. రాజకీయ నాయకులు , సినీ సెలబ్రిటీలు హాజరయ్యే ఈ పెళ్లికి  బెంగుళూరులోని దాదాపు అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లనూ ఆల్రెడీ బుక్ చేసేశారు .


End of Article

You may also like