ఏంటి శ్రియ కి ఏడాది పాప ఉందా..? ఫాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన శ్రియ..!

ఏంటి శ్రియ కి ఏడాది పాప ఉందా..? ఫాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన శ్రియ..!

by Anudeep

Ads

టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి.. దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆమె నటించింది. ప్రస్తుతం కూడా ఆమె పలు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ ఉన్నారు. వృత్తిగతంగానే కాదు.. శ్రియ వ్యక్తిగతంగా కూడా హ్యాపీ లైఫ్ స్టైల్ ను ఆస్వాదిస్తున్నారు. ఆండ్రూ కోశ్చీవ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న శ్రియ సంసారం జీవితాన్ని కూడా హ్యాపీగానే గడిపేస్తున్నారు.

Video Advertisement

sriya 1

వీరిద్దరూ కలిసి వీడియోలు షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇండస్ట్రీ లో హీరోయిన్లకు పెళ్లి అయ్యి.. పిల్లలు పుట్టాక ఇంకా అవకాశాలు రావడం తగ్గుతాయి అనే నమ్మకం ఉండనే ఉంది. కానీ, శ్రియ ఆ నమ్మకాన్ని పటాపంచలు చేసేసారు. తాజాగా.. ఆమె ఓ షాకింగ్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకున్నారు.

sriya 2

శ్రియ ఇదివరకే తల్లి అయ్యారట. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారట. ఆ పాప వయసు ప్రస్తుతం ఏడాది. అంటే శ్రియ గర్భవతి అయిందన్న విషయమే ఎవరికీ తెలియదు. ఆమెకు పాప పుట్టి తొమ్మిది నెలలు దాటిపోయింది. ఇప్పటివరకు ఈ విషయం బయటకు రాకుండా శ్రియ జాగ్రత్తపడ్డారట. తాజాగా ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నారు.

sriya 3

స్పెయిన్ -బార్సిలోనాలో పాపకు జన్మనిచ్చారట. భర్త ఆండ్రీ ఈ పాపకు “రాధ” అన్న అచ్చ తెలుగు పేరును పెట్టారు. పాప గురించి చెబుతూ..” రాధ నా బెస్ట్ ఫ్రెండ్.. నా ప్రపంచం..” అంటూ శ్రియ ఎమోషనల్ అయిపోయారు. తన పాప పెద్దది అవుతోందని.. ఇక నుంచి ఎక్కడకి వెళ్లినా.. రాధను నా వెంటే ఉంచుకోవాలని.. ఇక ఈ విషయం దాచడం కష్టమని ఆమె చెప్పుకొచ్చారు. మరో వైపు శ్రియ నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆర్ ఆర్ ఆర్”, “గమనం” సినిమాల ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడానికి శ్రియ సిద్ధంగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)


End of Article

You may also like