Ads
టాలీవుడ్ హీరోయిన్, కమల హాసన్ కూతురు శృతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడారు. జూమ్ డిజిటల్ కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె తన తల్లితండ్రుల సెపరేషన్ గురించి.. ఆ ప్రభావం తనపైన ఎలా పడిందో అని చెప్పింది. తన వరకు తన తల్లి తండ్రులు విడిపోవడమే మంచిదైందని పేర్కొంది. తన తల్లి తండ్రులు ఇద్దరు అద్భుతమైన వ్యక్తులని.. బలవంతం గా కలిసి ఉండాలని కోరుకోలేమని పేర్కొంది.
Video Advertisement
అయినప్పటికీ.. వారిద్దరూ అద్భుతమైన తల్లితండ్రులుగా కొనసాగుతున్నారని.. వారిద్దరూ దూరం గా ఉన్నా తనకు దగ్గరగానే ఉన్నారని పేర్కొంది. ముఖ్యం గా తండ్రి కమలహాసన్ తనతో ఎంతో సన్నిహితం గా ఉంటారని పేర్కొంది. మా అమ్మ కూడా హ్యాపీగానే లైఫ్ ని లీడ్ చేస్తోంది.. వ్యక్తిగతం గా వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులు.. కలిసి ఉన్నప్పటికంటే వారు ఇప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం గా ఉన్నారని చెప్పుకొచ్చింది.
End of Article