Ads
మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్. ఎస్. థమన్ ఒకరు. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. 2008 లో వచ్చిన మళ్లీ మళ్లీ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టారు. తర్వాత కిక్, ఆంజనేయులు, బృందావనం, నాయక్, దూకుడు, బిజినెస్ మాన్, బాద్షా, మిరపకాయ్, సరైనోడు, రామయ్యా వస్తావయ్యా , రేసుగుర్రం ఇలా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించారు.
Video Advertisement
ఇటీవల వచ్చిన అల వైకుంఠపురం లో సినిమాతో టాప్ లిస్ట్ లోకి చేరిపోయారు థమన్. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, సినిమాలకి కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. తమన్ ప్రముఖ దర్శకులు, నిర్మాత, అలాగే నటులు అయిన ఘంటసాల బలరామయ్యగారి మనవడు. తమన్ కుటుంబానికి కూడా సంగీత నేపథ్యం ఉంది.
తమన్ తండ్రి ఘంటసాల శివ కుమార్ గారు కూడా ఎన్నో సినిమాలకు డ్రమ్మర్ గా చేశారు. థమన్ తల్లి ఘంటసాల సావిత్రి గారు ప్రముఖ సింగర్. అలాగే సింగర్ బి.వసంత గారు కూడా తమన్ కి బంధువులు అవుతారు. థమన్ భార్య కూడా ప్రముఖ సింగర్. తన పేరు శ్రీ వర్ధిని. శ్రీ వర్ధిని తెలుగు, తమిళ్ లో ఎన్నో పాటలు పాడారు.
తెలుగులో గోవిందుడు అందరివాడేలే, అల్లరి పిడుగు, బాడీగార్డ్, నా ఆటోగ్రాఫ్, స్టూడెంట్ నెంబర్ 1, మిరపకాయ్, యజ్ఞం, శక్తి, తీన్ మార్, అభిమన్యుడు సినిమాల్లో పాటలు పాడారు. ఇటీవల వచ్చిన మిస్ ఇండియా సినిమాలో కూడా ఒక పాటని పాడారు. అంతే కాకుండా ఈటీవీ లో టెలికాస్ట్ అయ్యే స్వరాభిషేకం షోలో కూడా ఎన్నో పాటలు పాడారు శ్రీ వర్ధిని.
watch video:
also watch:
End of Article