Ads
తమిళ స్టార్ సూర్య నటించిన గజిని అటు తమిళంలో ఇటు తెలుగు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఏఆర్ మురుగదాస్ దీనికి దర్శకత్వం వహించగా , ఆసిన్, నయనతార హీరోయిన్లు గా నటించారు. 2005 సెప్టెంబర్ లో గజినిని తమిళ్ లో విడుదల చేసారు అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో.. అల్లు అరవింద్ తెలుగులో డబ్ చేసి 2005 నవంబర్ లో రిలీజ్ చేసారు.
Video Advertisement
ఇక్కడ కూడా గజిని సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సూర్య యాక్టింగ్ నెక్ట్ లెవెల్ లో ఉంటుంది. దీంతో తెలుగులో కూడా సూర్యకు అభిమానులు పెరిగిపోయారు. గజినిలోని పాటలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా గజిని సినిమా గురించి మాధవన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు. మొదటి గజిని కథ నా వద్దకే వచ్చింది కానీ సినిమాలో సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో తిరస్కరించాను.
గజిని కోసం సూర్య ఒక వారం పాటు ఉప్పు తినలేదని తెలిసిన తర్వాత సూర్య కష్టాన్ని, కృషిని గ్రహించానని తెలిపాడు మాధవన్. గజిని టాలీవుడ్, కోలీవుడ్ లో హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు. మురుగదాస్ దీనికి డైరెక్టర్ కాగా, అమీర్ ఖాన్ సూర్య పాత్రలో నటించారు. ఇటీవల మాధవన్ నటించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ విడుదలైంది. దీనికి డైరెక్టర్ కూడా మాధవనే. మరోవైపు సూర్య మొన్న విక్రమ్ లో ఓ కామియో రోల్ చేసిన విషయం అందరికి తెలిసిందే.
End of Article