Ads
సినీమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన చిత్రం కొన్ని కారణాల వల్ల మరో హీరో నటించడం, ఆ చిత్రం సూపర్ హిట్ లేదంటే ప్లాఫ్ కావడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఆ విషయం తెలిసినపుడు ఆ మూవీ హిట్ అయితే సదరు హీరో ఫ్యాన్స్ తమ హిరో మంచి మూవీని మిస్ చేసుకున్నాడని బాధపడతారు. అదే మూవీ ప్లాప్ అయితే హమ్మయ్య మా హీరో తప్పించుకున్నాడు అని సంతోషపడుతుంటారు.
Video Advertisement
ఇలా తాజాగా ఒక చిత్రానికి జరిగింది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరుకారం చిత్రం. ఈ మూవీ గురించిన వార్త ఒకటి వైరల్ గా మారింది. ఈ మూవీలో ముందుగా అనుకున్నది మహేష్ ని కాదంట. మరో తెలుగు స్టార్ హీరోని అంట. మరి ఆ స్టార్ హిరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం గుంటూరుకారం. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో దీని గూర్చి చర్చ జరుగుతోంది. ఈ వీడియోకి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మహేష్ చాలా ఏళ్ల తరువాత మాస్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఇలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేసినందుకు మేకర్స్ కు కృతఙ్ఞతలు చెప్తున్నారు.
అయితే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీకి హీరోగా త్రివిక్రమ్ ముందుగా ఎంచుకుంది మహేష్ బాబుని కాదంట. త్రివిక్రమ్ చేయాలనుకున్నది జూనియర్ ఎన్టీఆర్ తో అంట. ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత తారక్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సింది. త్రివిక్రమ్ చెప్పిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని చెప్పడం, త్రివిక్రమ్ మార్పులు చేసినప్పటికీ ఎన్టీఆర్ కి నచ్చలేదంట.
దాంతో ఆ కథకు మహేష్ బాబు తగిన విధంగా అదనంగా కొన్ని సన్నివేశాలను రాసి మహేష్ బాబుతో గుంటూరు కారం గా తీస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్లుగా పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. సీనియర్ హీరో జగపతిబాబు విలన్‌గా చేస్తున్నాడు.
End of Article