“నో షేవ్ నవంబర్” అంటారు…అసలు ఈ నెలలో గడ్డం ఎందుకు గీసుకోరో తెలుసా.?

“నో షేవ్ నవంబర్” అంటారు…అసలు ఈ నెలలో గడ్డం ఎందుకు గీసుకోరో తెలుసా.?

by Mohana Priya

Ads

నవంబర్ వచ్చేసింది. ఈ నెలలో మొదలయ్యే ట్రెండ్ “నో షేవ్ నవంబర్”. సాధారణంగా మనందరికీ తెలిసినంత వరకు నవంబర్ నెలలో చాలా మంది మగవాళ్ళు షేవ్ చేసుకుకోకుండా ఉండడమే ఈ నో షేవ్ నవంబర్. చాలా మంది ఈ ట్రెండ్ పాటిస్తారు. కానీ అసలు నో షేవ్ నవంబర్ ట్రెండ్ వెనకాల కారణం ఏంటో తెలుసా? ఇది ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలుసా? వీటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

నో షేవ్ నవంబర్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మువెంబర్ అంటే ఏంటో చూద్దాం. ఆస్ట్రేలియాకు చెందిన మువెంబర్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ మూమెంట్ ని మొదలుపెట్టింది. మువెంబర్ అంటే ముస్టాచ్ (గడ్డం) ఇంకా నవంబర్ కలిపితే వచ్చే పదం. మెల్బోర్న్ లో ఇద్దరు స్నేహితులు 2003 లో మొదలుపెట్టి 2004 లో దీనికంటూ వెబ్ సైట్ క్రియేట్ చేసి ఈ మూమెంట్ ని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ వెబ్ సైట్ పేరే మువెంబర్ ఫౌండేషన్.

అలా మొదలుపెట్టిన ఈ మూమెంట్, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. చికాగోకి చెందిన మాథ్యూ హిల్‌ అనే ఒక వ్యక్తి 2007, నవంబర్ లో కోలన్ క్యాన్సర్ తో చనిపోయారు. అప్పుడు 2009 లో నో షేవ్ నవంబర్ అనే పేజ్ ని మాథ్యూ హిల్ కుటుంబ సభ్యులు మొదలుపెట్టారు.

అసలు నో షేవ్ నవంబర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో మగ వాళ్ళకి సంబంధించిన క్యాన్సర్,మగ వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఇంకా మెంటల్ హెల్త్ గురించి అవగాహన తీసుకురావడం, అలాగే మద్దతివ్వడం.అంతే కాకుండా నో షేవ్ నవంబర్ ద్వారా సంవత్సరంలో ఎన్నో డబ్బులు చారిటీకి వెళ్తాయి. అది ఎలా అంటే. మగ వాళ్ళు ఒక్క నెలలో సెలూన్ సర్వీసెస్ కి అయ్యే ఖర్చు ఆపి, ఆ డబ్బులని క్యాన్సర్ పేషెంట్స్ కి విరాళంగా ఇస్తారు.

ప్రతి సంవత్సరం నో షేవ్ నవంబర్ మూమెంట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిలియన్ డాలర్లు విరాళంగా అందిస్తున్నారు. ఇందులో నవంబర్ నెలలో మగవాళ్ళు ట్రిమ్మర్, రేజర్, కత్తెర లాంటివి వాడకుండా. జుట్టుని పెరగనిస్తారు. అలా గ్రూమింగ్ కి అయ్యే ఖర్చుని విరాళంగా అందజేస్తారు. 2013 లో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా దీనికి తోడయ్యి తమ వంతు మద్దతుని ఇస్తున్నారు.

https://www.youtube.com/watch?v=bWNO6kcb8VA

 


End of Article

You may also like