NTR 30 “దేవర” టైటిల్ వెనుక ఉన్న స్టోరీ ఏమిటో తెలుసా?

NTR 30 “దేవర” టైటిల్ వెనుక ఉన్న స్టోరీ ఏమిటో తెలుసా?

by kavitha

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా  కావడంతో ఈ చిత్రం పై అటు ఫ్యాన్స్ ఇటు టాలీవుడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Video Advertisement

మొన్నటివరకు ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలిచిన ఈ సినిమాకి ‘దేవర’ అనే పేరును ఖరారు చేసినట్లుగా కొద్ది రోజుల నుండి వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘దేవర’ టైటిల్ వెనుక ఉన్న కథ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫిషియల్ గా  ‘దేవర’ టైటిల్ పోస్టర్  రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసినప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్  సంతోషపడుతున్నారు. టైటిల్ చాలా బాగుందని, తారక్ కి సెట్ అవుతుందని ఆనందపడుతున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉంటుందంట. ఆ పాత్ర  తండ్రి పేరే దేవర ( ఎన్టీఆర్) అని తెలుస్తోంది.
ఇక సినిమా కథ మొత్తం దేవర పాత్ర చుట్టూ తిరుగుతుందని, మూవీలో ఎక్కువ భాగం దేవరనే ఉంటాడంట. అయితే ఈ చిత్రంలో జాహ్నవి కపూర్ తండ్రి దేవర పక్కన హీరోయిన్ గా నటిస్తుందా? లేదా యంగ్ ఎన్టీఆర్ కి  హీరోయిన్ గా నటిస్తుందా అనేది తెలీదు. జాహ్నవి కపూర్ ఒకవేళ యంగ్ ఎన్టీఆర్ కి జంటగా చేస్తే, సినిమాలో జాన్వీ కపూర్ తక్కువ టైం ఉంటే మూవీకి మైనస్ ఏమైనా అవుతుందా అని నెటిజనులు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ రోల్ ఈ మూవీలో డబల్ అయితే జాన్వీ కపూర్ ఏ పాత్రకి హీరోయిన్ గా చేస్తుందనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృత పడుతున్నారు. ఇదిలా ఉండగా కొరటాల శివ దేవర పాత్రను అద్భుతంగా షూట్ చేస్తున్నాడట. సముద్రం ఒడ్డున జీవించేవారికి అండగా ఉండి, ధైర్యాన్ని ఇచ్చే పాత్ర దేవర అని టాక్. పోస్టర్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఫోజు ఇంటర్వెల్ బ్యాంగ్ అని  అంటున్నారు. ఇక ఈ మూవీలో మొదట్లో యంగ్ ఎన్టీఆర్ కనిస్తారని, ఆ తర్వాత తండ్రి ‘దేవర’ క్యారెక్టర్ ను పరిచయం చేస్తాడట. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలలో విలన్స్ సముద్రం తీరాన ఉన్న పేదవారిని హింసిస్తుంటారట.
ఆ సమయంలో దేవర పాత్ర ఎంట్రీ ఇచ్చి, అందరిని తరిమి తరిమి చంపుతాడంట. అలా చంపే క్రమంలో దేవర పై  రక్తం పడుతుందని, రక్తంతో అలాగే నిలబడి ఉన్న స్టిల్ తోనే  విరామం వస్తుందని నెటిజనులు ఎవరికి నచ్చిన కథను వాళ్ళు చెప్తున్నారు. ఈ మూవీ ఒక రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.

Also Read: “విరూపాక్ష” సినిమాలో “హీరోయిన్ తల్లి” గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?


End of Article

You may also like