“జల్సా” సినిమాలోని ఈ సీన్ వెనుక… ఇంత పెద్ద కథ ఉందా..?

“జల్సా” సినిమాలోని ఈ సీన్ వెనుక… ఇంత పెద్ద కథ ఉందా..?

by Anudeep

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అభిమానులకు పెద్ద పండుగ. వాళ్లిద్దరు సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. అలా వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన జల్సా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చి పద్నాలుగు ఏళ్ళైనా ఇప్పటికి ఈ మూవీ చాలా మందికి ఆల్ టైం ఫేవరెట్ గా ఉంది.

Video Advertisement

పవర్ స్టార్ మేనరిజం, త్రివిక్రమ్ మాటల మాయాజాలం, దర్శకత్వ ప్రతిభ తో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది . తాజాగా ఈ సినిమాలో ఇంట్రడక్షన్ షాట్ వెనుక ఉన్నస్టోరీ గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి .

“హైదరాబాద్ లో జల్సా షూటింగ్ జరుగుతున్నపుడు ఒక రోజు సంధ్యా సమయంలో నేను దూరంగా ఉన్న కొండలు, ప్రకృతిని చూస్తూ నిలుచున్నా. ఆ సమయంలో నా ఆలోచనలు విధ్వంసం చుట్టూ తిరుగుతున్నాయి .. అప్పుడు వెనక నుంచి నన్ను షూట్ చేస్తున్నారని నాకు తెలీదు తీరా చూస్తే సినిమాలో అదే ఫస్ట్ సీన్ “..అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంత క్లాసిక్ మూవీ ఫస్ట్ సీన్ ఇలా అనుకోకుండా తీశారంటే ఆశ్చర్యంగా ఉంది కదా..అందులోనే దర్శకుడు త్రివిక్రమ్ మాయాజాలం ఉంది అంటూ మురిసిపోతున్నారు పవర్ స్టార్ అభిమానులు.


గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం లో ఇలియానా, పార్వతి మెల్టన్, కమలిని ముఖేర్జీ హీరోయిన్లు గా నటించగా, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం తమ అభిమాన హీరోల పుట్టిన రోజులకు వారి వారి సూపర్ హిట్ సినిమాలను రిలీజ్ చేయడం చూస్తున్నాం. అదే దారిలో పవర్ స్టార్ బర్త్ డే కి జల్సా మూవీ ని రిలీజ్ చేయాలనీ అభిమానులు సిద్దపడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.


End of Article

You may also like