Ads
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది ప్రారంభంలోనే వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. అంతకు ముందు క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి మినిమమ్ గ్యారెంటీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది.
Video Advertisement
వీరసింహారెడ్డి హిట్ అవడంతో గోపీచంద్ తరువాతి సినిమాలు స్టార్ హీరోలతో చేస్తాడని అంతా భావించారు. ఆ వైపుగా గోపీచంద్ మలినేని ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని ఇద్దరు స్టార్ హీరోలకు కథ చెప్పారు. కానీ వారిద్దరూ రిజెక్ట్ చేశారు. మరి గోపీచంద్ కథని రిజెక్ట్ చేసిన ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గోపీచంద్ మలినేని దర్శకుడిగా తీసిన మొదటి సినిమా మాస్ మహారాజ రవితేజ నటించిన డాన్ శీను. ఆ మూవీ హిట్ కావడంతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డితో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీ తరువాత గోపీచంద్ మలినేనికి స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ అలా జరుగలేదు.
అయితే వీరసింహారెడ్డి సమయంలోనే గోపీచంద్ మలినేని సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్టోరీ చెప్పడం జరిగిందట. గోపీచంద్ తరువాతి మూవీ మైత్రి వారితోనే చేయాలి. మహేష్ బాబు వద్ద మైత్రి మేకర్స్ అడ్వాన్స్ ఉంది. అయితే మహేష్ బాబు కాల్ షీట్స్ మాత్రం ఇప్పట్లో ఖాళీ లేకపోవడంతో గోపీచంద్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేయాలని ప్రయత్నించాడు. ఎందుకంటే విజయ్ దగ్గర కూడా మైత్రి మేకర్స్ అడ్వాన్స్ ఉంది. కానీ అతను ఒప్పుకోలేదు.
చివరకు గోపీచంద్ మలినేని తనకు హ్యట్రిక్ హిట్స్ ఇచ్చిన రవితేజతోనే ఫిక్స్ అయ్యాడు. గోపీచంద్ మలినేని తరువాతి సినిమా రవితేజతో అని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు విజయం సాధించాయి. దాంతో వీరి కాంబో పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: ఈ మాత్రం దానికి ఇంత ఎందుకు..? అసలు ఏం చేస్తున్నారు..?
End of Article