Ads
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి.. అది క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రలో ఎప్పుడు ఎక్కడ కలవని ఇద్దరు వీరులను కలిపి ఫిక్షనల్ స్టోరీ గా చూపించి ఆకట్టుకున్నారు జక్కన్న. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్ ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
Video Advertisement
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయట పెట్టారు రాజమౌళి. ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి వాటిలో క్లైమాక్స్ లో వచ్చే షోల్డర్ ఫైట్ ఒకటి. అల్లూరి సీతారామరాజును బ్రిటీష్ ప్రభుత్వం బంధిస్తే ఆ చెరనుంచి చరణ్ ను తారక్ కాపాడి తీసుకువెళ్ళటప్పుడు వచ్చే షోల్డర్ ఫైట్ సినిమా కు వన్ ఆఫ్ ది హైలైట్. ఈ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు హీరోలు. అయితే ఈ ఫైట్ ను కంపోజ్ చేసింది ఫైట్ మాస్టర్ కాదట.
ఈ షోల్డర్ ఫైట్ కంపోజ్ చేసింది ఓ డ్యాన్స్ మాస్టర్ అని షాక్ ఇచ్చారు జక్కన్న. కొన్ని తెలుగు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ ఫైట్స్ కంపోజ్ చేస్తుంటారు, ఫైట్ మాస్టర్లు పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఇదేంటి.. ఇలా కూడా జరుగుతుందా అనుకుంటున్నారా? దీనికి గతంలో రెండు, మూడు సార్లు ఆన్సర్ విన్నాం. రీసెంట్‌గా అయితే రాజమౌళి కూడా ఇలాంటి విషయమే చెప్పారు.
రామ్‌చరణ్‌ను భుజాల పైన కూర్చోబెట్టుకుని ఎన్టీఆర్ ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్ ను కంపోజ్ చేసింది ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అని తెలిపారు జక్కన్న. ఇక ఈ సినిమాలో నాటు నాటు పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటను కూడా ప్రేమ్ రక్షితే కంపోజ్ చేశారు. ఈ పాటలో తారక్, చరణ్ స్టెప్పులు మతిపోగొడతాయి.
దీనికి సంబంధించిన వీడియోను ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. రాజమౌళికి థ్యాంక్యూ చెప్పుకొచ్చారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వంద సిగ్నేచర్ స్టెప్పులను కంపోజ్ చేసి వాటిలో బెస్ట్ స్టెప్స్ చరణ్ తారక్ తో చేయించారని అన్నారు రాజమౌళి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌తో పని చేయడం తనకు చాలా ఇష్టమని కూడా రాజమౌళి అన్నారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా విజయం అందుకోవడమే కాకుండా దేశవిదేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేస్‌లో ఉంటుందని హాలీవుడ్ మ్యాగజైన్స్ కూడా కోడై కూశాయి. ఇక ఇప్పుడు ఏకంగా 15 విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను నామినేట్ చేయాలని క్యాంపెనింగ్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ టీమ్. ఈ నేపథ్యం లో రాజమౌళి గత కొన్ని రోజులుగా అమెరికా లోనే ఉంటున్నట్లు సమాచారం.
End of Article