వైరల్ అయిన ఈ “సమంత” డాన్స్ వీడియో వెనకాల… ఇంత పెద్ద స్టోరీ ఉందా..?

వైరల్ అయిన ఈ “సమంత” డాన్స్ వీడియో వెనకాల… ఇంత పెద్ద స్టోరీ ఉందా..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సమంత వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అలాగే సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల అయింది.

సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా పోస్ట్ చేస్తు ఉంటారు. వాటికి మిలియన్స్ సంఖ్యలో లైక్స్, వ్యూస్ వస్తాయి. ఇటీవల కూడా బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు పాటకి డ్యాన్స్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఈ వీడియోని ఎన్నో లక్షల మంది చూసారు. చాలా రోజుల వరకు ఈ వీడియో వైరల్ అయింది. ఇదిలా ఉండగా, ఈ వీడియోకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ వీడియో ఒక పెయిడ్ ప్రమోషన్.

story behind samantha arabic kuthu dance video

ఈ ప్రమోషన్ కోసం సమంత చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారట. సమంత ఒక్కరు మాత్రమే కాదు. నటి కీర్తి సురేష్ కూడా ఈ పాటకి డ్యాన్స్ చేసారు. అంతే కాకుండా ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు, అలాగే బీస్ట్ సినిమాలో భాగమైన హీరోయిన్ పూజా హెగ్డే, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా ఈ పాటకి డ్యాన్స్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.


End of Article

You may also like