Ads
ఒక సినిమాకి హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వీటితో పాటు ఇంపార్టెంట్ అయినది ఒక డైరెక్టర్, ఇంకా ఆ డైరెక్టర్ విజన్. ఆ డైరెక్టర్ టేకింగ్ ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది అనే విషయం మన అందరికీ తెలుసు. ప్రతి డైరెక్టర్ కి ఒక డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది. కథని ట్రీట్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి కథ మామూలుదే అయినా కూడా డైరెక్టర్ టేకింగ్ వల్ల సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఒక డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుందో చెప్పడానికి మూడు సంవత్సరాల క్రితం వచ్చిన రంగస్థలం సినిమా ఒక ఉదాహరణ.
Video Advertisement
ఈ సినిమా ఎన్నో కారణాల వల్ల ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. మనం అంతకుముందు రామ్ చరణ్ ని ఇలా ఎప్పుడూ చూడలేదు. అది కూడా హీరో పాత్రకి లోపం ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ సుకుమార్ ఈ సినిమాతో ఆ సాహసం చేశారు. అలాగే సినిమాలోని సెట్టింగ్స్ కూడా సినిమాకి ప్రాణం పోశాయి. అయితే, ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి విడుదల సమయంలో అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఒక సీన్లో రామ్ చరణ్ సమంత మీద కోపంగా ఉంటారు. రామలక్ష్మి పాత్ర పోషించిన సమంతకి తను ఇష్టం లేదు అని చిట్టిబాబు అయిన రామ్ చరణ్ అంటారు.
అలాగే తర్వాత రామలక్ష్మిని, చిట్టిబాబు కొడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్లి చిట్టిబాబుని ముద్దు పెట్టుకుంది. ఈ సీన్ పై ఆ సమయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కొంత మంది, “ఇది కేవలం సినిమా” అంటే, కొంత మంది “ఇలాంటి సీన్ చేయడం కరెక్ట్ కాదేమో” అని అన్నారు. ఈ సినిమా విడుదల అయ్యే కొన్ని నెలల ముందే సమంతకి పెళ్లి కావడంతో ఇంకా చర్చలకు దారి తీసింది. అయితే, ఈ సీన్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. సుకుమార్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
ముందుగా ఈ సినిమాలో ముద్దు సీన్ కోసం సుకుమార్, రామ్ చరణ్ ని కన్విన్స్ చేశారట. ఎందుకంటే రామ్ చరణ్, ఉపాసన, గురించి అలాగే తన ఫ్యాన్స్ గురించి ఆలోచించి సీన్ చేయడం అంత మంచిది కాదేమో అని అనుకున్నారట. అందుకే సుకుమార్ రామ్ చరణ్ ని చాలా కన్విన్స్ చేశారు. కానీ చివరి నిమిషంలో సుకుమార్ తన నిర్ణయం మార్చుకున్నారు. రామ్ చరణ్ తో ఈ సీన్ చేయాల్సిన అవసరం లేదు అని, కేవలం సమంతకి దగ్గరగా వెళ్లి నుంచుంటే చాలు అని, మిగిలింది అంతా విఎఫ్ఎక్స్ (VFX) ద్వారా మేనేజ్ చేయొచ్చు అని చెప్పారట. కానీ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఇది సహజంగా జరిగిన సన్నివేశంలానే అనిపిస్తుంది. అంటే గ్రాఫిక్స్ అంత బాగా చేశారు అని అనుకోవచ్చు.
End of Article