Ads
సాధారణంగా బిడ్డ జన్మించింది అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా కన్నతల్లికి ఆనందమే వేరు. అయితే బిడ్డ జన్మించింది అంటే ఇంట్లో వేడుకలు జరగడం… అందంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అనుకున్నది ఏమి జరగలేదు. కనీసం పుట్టిన రోజు కూడా జరగలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే… ప్రసవం తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనుపమ తన బిడ్డని కోల్పోయింది.
Video Advertisement
హాస్పిటల్ నుండి తల్లి, బిడ్డ ఇద్దరు వేరవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వీళ్ళు కలవలేదు. ఇంకా తన బిడ్డని చూడాలని పోరాడుతోంది అనుపమ. తన బిడ్డ కావాలని ముఖ్యమంత్రికి కూడా విన్నవించుకుంది. కానీ ఇంకా ఆచూకి మాత్రం దొరకలేదు. అయితే ఈ చంటిబిడ్డ మాయం అవడానికి కారణం ఆ బిడ్డ తాత జయచంద్రన్. అతను ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. వీళ్లది కేరళ.
అసలు బిడ్డ ఏమైంది అని అడుగుతుంటే దత్తత ఇచ్చేసాను అని చెబుతున్నాడు. మానసిక స్థితి మరియు ఆర్థిక స్థితి సరిగాలేదని అందుకోసమే దత్తత ఇచ్చేస్తామని పైగా తన కూతురు కూడా సంతకం చేసిందని అంటున్నారు అనుపమ. అజిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుపమ. వాళ్ళు మలబార్ ఎరావా సామాజిక వర్గానికి చెందిన వారు. అజిత్ ఒక దళిత క్రిస్టియన్. అయితే ఆమె తండ్రి ప్రేమను అంగీకరించలేదు.
అనుపమకి ఒక అక్క ఉంది. తనకి పెళ్ళి అయ్యేవరకూ ఈమె పెళ్లి గురించి బిడ్డ గురించి రహస్యంగా ఉంచాలని అనుకున్నారు. డెలివరీ అయిపోయిన వెంటనే అనుపమని తీసుకుని జయచంద్రన్ స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత పుట్టింటికి తీసుకు వెళ్ళిపోయారు. అక్కడ ఆమెను ఒక గదిలో బంధించారు. బిడ్డ వివరాలు కూడా ఎవరూ చెప్పలేదు. తనకు వారసత్వంగా రావలసిన హక్కు వదులుకోవాలని తండ్రి సంతకం చేయమన్నాడు.
తండ్రి చెప్పినట్లే ఆమె పలు చోట్ల సంతకాలు చేసింది. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే బిడ్డని నీ అంగీకారం ప్రకారమే దత్తత ఇచ్చేసాను అని తండ్రి చెప్పాడు. అలానే తండ్రి డెలివరీ అయ్యే లోపు ఒకసారి అబార్షన్ కూడా చేయించడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే బిడ్డ ఎక్కడుందని మొత్తుకునేసరికి జయచంద్రన్ అనాధ బిడ్డల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మతొట్టిల్ పధకం ఉయ్యాల్లో వేశారని చెప్పారు. అయితే అది నిజమో కాదో తెలియదు. పోలీసులు దర్యాప్తులో మాత్రమే నిజం తేలుతుంది. ఒకవేళ కనుక అనుపమ బిడ్డ అయితే తిరిగి మళ్లీ దంపతులకు అప్పగించడం చట్టరీత్యా చాలా కష్టం.
End of Article