కూతురి అందాన్ని ఓర్వలేక…సొంత తల్లే 25 ఏళ్లు చీకటిగదిలో కూతురుని బంధించింది.! రియల్ స్టోరీ!!!

కూతురి అందాన్ని ఓర్వలేక…సొంత తల్లే 25 ఏళ్లు చీకటిగదిలో కూతురుని బంధించింది.! రియల్ స్టోరీ!!!

by Mohana Priya

Ads

సాధారణంగా ఏ తల్లిదండ్రులకైనా వాళ్ల పిల్లలు అంటే ప్రేమ ఉంటుంది. వాళ్లు తమ పిల్లలు ఆనందంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. కానీ ప్రపంచంలో ఉన్న అందరు మనుషులు ఒకే లాగా ఉండాలి అని లేదు. అలాగే ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలతో ప్రేమగానే ఉండాలి అని లేదు. కొందరు తల్లితండ్రులు సైకోయిజాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. పిల్ల‌లు అందంగా ఉంటే వారికి ఆ అందం లేకుండా చేస్తారు. అసలు విషయం ఏమిటో ఈ కథ చదివితే మీకే అర్థమవుతుంది.

Video Advertisement

బ్లాంచె మోనియర్ ఫ్రాన్స్ కి చెందిన ఒక సోషలైట్. మార్చ్ 1, 1849 లో బ్లాంచె మోనియర్ జన్మించారు. బ్లాంచె మోనియర్ ఎంతో అందంగా ఉండేవారట. ఎంతోమంది బ్లాంచె మోనియర్ ను పెళ్లి చేసుకోవడానికి అడిగేవారట. కానీ తనకంటే వయసులో ఎంతో పెద్దవారైన ఒక లాయర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు బ్లాంచె మోనియర్.

బ్లాంచె మోనియర్ తల్లి లూయిస్ కి ఈ పెళ్లి ఇష్టం లేదు. సంపాదన లేని ఒక లాయర్ ని ఎలా పెళ్లి చేసుకుంటావని అడిగారట. తన తల్లి కి బ్లాంచె మోనియర్ కి మధ్య వాదన జరిగిన తర్వాత అప్పటికి కూడా బ్లాంచె మోనియర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో లూయిస్, బ్లాంచె మోనియర్ ని ఒక చీకటి గదిలో బంధించారట.

బ్లాంచె మోనియర్ గదిలో బంధించబడ్డారు అన్న విషయం ఎవరికీ తెలియదు. 1885 లో బ్లాంచె మోనియర్ పెళ్లి చేసుకుందామనుకున్న లాయర్ మరణించారు. 23 మే 1901 లో ప్యారిస్ అటర్నీ ఆఫ్ జనరల్ కి ఒక ఉత్తరం వచ్చిందట. కానీ ఆ ఉత్తరం ఎవరు రాశారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు.

ఆ ఉత్తరంలో బ్లాంచె మోనియర్ ని బంధించారు అని రాసి ఉందట. దాంతో పోలీసులు బ్లాంచె మోనియర్ ఇంటికి వెళ్లి తనని బంధించిన గదిలో నుండి విడిపించారు. పోలీసులు బ్లాంచె మోనియర్ బంధించి ఉన్న గది తలుపు తెరవగానే భరించలేని వాసన వచ్చిందట.

బ్లాంచె మోనియర్ బరువు తగ్గి పోయి 25 కిలోల వరకు ఉన్నారట. మంచం మీద, ఇంక నేల మీద పురుగులు ఉన్నాయట. బ్లాంచె మోనియర్ మానసిక సంబంధిత సమస్యలతో పాటు, అనొరెక్సియా నెర్వోసా (తక్కువ బరువు), స్కిట్జోఫ్రీనియా (హల్యూసినేషన్), ఎగ్జిబిషనిజం, ఇంకా కోప్రోఫిలియా సమస్యలను ఎదుర్కొన్నారట.

ఫ్రాన్స్ లో ఉన్న సైకియాట్రిక్ ఆస్పత్రిలో బ్లాంచె మోనియర్ కి చికిత్స అందించారు. అనారోగ్య సమస్యల కారణంగా 1913లో బ్లాంచె మోనియర్ మరణించారు.  బ్లాంచె మోనియర్ తల్లి లూయిస్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత లూయిస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

అనారోగ్య సమస్యలు మొదలైన పదిహేను రోజుల తర్వాత లూయిస్ పై కోపంతో ఉన్న కొంతమంది ఒక గుంపు లాగా ఏర్పడి ఆమె ఇంటి ముందు గుమిగూడడాన్ని చూసి లూయిస్ మరణించారు. 1930లో ఆండ్రీ గైడ్ అనే రచయిత బ్లాంచె మోనియర్ కథ ఆధారంగా ఒక పుస్తకాన్ని రాశారు.

కానీ కథ లో ఉన్న పాత్రల పేర్లను మార్చారు. తమ పిల్లల కోసం ఎవరితోనైనా పోరాడే తల్లిదండ్రుల మధ్యలో లూయిస్ లాంటి మానవత్వం మరిచిపోయిన వ్యక్తులు కూడా ఉంటారు. అందుకు బ్లాంచె మోనియర్ కథ ఒక ఉదాహరణ. ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలతో ప్రేమగా ఉండాలి అని లేదు అని మొదట్లో ఎందుకు అనుకున్నామో ఇప్పుడు మీకు అర్థం అయ్యే ఉంటుంది.


End of Article

You may also like