Ads
ఒక మనిషి కష్టపడితే ఏదైనా సాధించగలరు. ఎంత ఎత్తుకు అయినా ఎదగగలరు. ఈ మాటలు అన్నీ మనం చాలాసార్లు వినే ఉంటాం. దీనికి ఉదాహరణ కూడా చాలా మందిని మనం చూసే ఉంటాం. బెంగళూరుకి చెందిన రమేష్ బాబు ఈ కోవకి చెందుతారు. రమేష్ బాబు ఒక సెలూన్ నడుపుతారు. రమేష్ బాబు ఉండే ప్రాంతంలో కేవలం ఐదుగురికి మాత్రమే లగ్జరీ కార్లు ఉన్నాయి. వారిలో రమేష్ బాబు కూడా ఒకరు.
Video Advertisement
రమేష్ బాబు కి 3.1 కోట్ల విలువచేసే రోల్స్ రాయిస్ కారు ఉంది. రమేష్ బాబు ఇదే కారులో సెలూన్ కి వెళ్తారు. రమేష్ బాబు చిన్న వయసులో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారు. వారికి ఒక బార్బర్ షాప్ ఉండేది. దాని పేరు ఇన్నర్ స్పేస్. తర్వాత నుండి ఈ షాప్ ని రమేష్ బాబు నడపడం మొదలు పెట్టారు. సెలూన్ లో చేసే హెయిర్ స్టైల్స్ వల్ల ఇన్నర్ స్పేస్ చాలా పాపులర్ అయింది. అయితే రమేష్ బాబుకి కార్ కొనుక్కోవాలి అనే కోరిక ఉండేదట.
కొంతకాలం తర్వాత ఒక మారుతి ఓమ్ని కొనుక్కొని అవసరమైన వాళ్లకి కార్ రెంట్ కి ఇవ్వడం మొదలుపెట్టారు. 1994 నుండి ఈ కార్ రెంట్ కి ఇచ్చే బిజినెస్ ని సీరియస్ గా తీసుకున్నారు రమేష్ బాబు. 2004 వరకు రమేష్ బాబు దగ్గర 5 నుండి 6 కార్లు ఉండేవి. 2004 లో లగ్జరీ కార్ కొన్నారు. అప్పుడు రమేష్ బాబుకి అందరూ తప్పు చేస్తున్నారు అని చెప్పారట.
కానీ అప్పటివరకూ కార్ రెంట్ కి ఇచ్చే సెంటర్స్ లో అందరూ లగ్జరీ కార్లు అంటే సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రమే తీసుకునేవారు. చుట్టుపక్కల అలా రెంటల్ సర్వీస్ కోసం 40 లక్షలు పెట్టి లగ్జరీ కారు కొన్న మొదటి వ్యక్తి గా రమేష్ బాబు నిలిచారు. అనుకున్నట్టే ఈ ఆలోచన సక్సెస్ అయ్యింది.
2011 లో రోల్స్ రాయిస్ కారు కొన్నారు. రమేష్ బాబు తీసుకున్న ఈ రిస్క్ కూడా అనుకున్నట్టుగానే సక్సెస్ అయింది. రమేష్ బాబు పొద్దున్నే 6 గంటలకి గ్యారేజ్ కి వెళ్లి అన్ని చెక్ చేసుకుని 10:30 కి ఆఫీసులో ఉంటారట. ఐదున్నరకి సెలూన్ కి వెళ్తారు. రమేష్ బాబు సెలూన్ కి ఎంతో మంది ప్రముఖులు వస్తారు అలాగే ముంబై, కోల్కతా నుండి కూడా చాలా మంది ప్రత్యేకంగా హెయిర్ కట్ కోసం రమేష్ బాబు సెలూన్ కి వెళ్తారట.
End of Article