మనందరికీ ఫేవరెట్ కలర్స్ అంటూ ప్రత్యేకం గా ఉంటాయి. మనకు బాగా ఇష్టమైన వాటిని ఫేవరెట్ కలర్స్ లో తీసుకున్నప్పటికీ.. ఇతర రంగులను కూడా వాడుతూనే ఉంటాం. మనకి ఇష్టమైన రంగులతో పాటు అన్ని రంగులను ఇంట్లోనూ, దుస్తుల విషయం లోను, ఎలక్ట్రానిక్స్ లో కూడా వాడుతూనే ఉంటాం. కానీ.. బెంగుళూరు కి చెందిన ఈ ఫ్యామిలీ మాత్రం అలా కాదు. వాళ్ళ ఇంట్లో అయినా.. ఆఫీస్ లో అయినా ఎటు చూసిన రెడ్ అండ్ వైట్ తప్ప ఇంకొక కలర్ ఉండదు.

red and white family 1

అసలు వాళ్ళ లైఫ్ లోకి వేరే కలర్ నే రానివ్వలేదు. ఈ క్రేజీ ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. దాదాపు కొన్ని సంవత్సరాలు గా వారు ఈ రెండు రంగులను తప్ప మరో రంగుని వినియోగించట్లేదు. అందుకే అక్కడి వారు ఈ ఫ్యామిలీ ని ఏకం గా “రెడ్ అండ్ వైట్ ” ఫ్యామిలీ అని పిలిచేస్తూ ఉంటారు. బెంగళూర్ కి చెందిన సెవెన్ రాజ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆయన ఏడవసంతానం గా జన్మించారు. అందుకే ఆయన్ని సెవెన్ రాజ్ అని పిలుస్తూ ఉంటారు.

red and white family 1

సెవెన్ రాజ్ కు రెడ్ అండ్ వైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అందుకే.. ఆయన ఆఫీస్ లో అన్ని వస్తువులు ఎక్కువ గా ఆ కలర్ లోనే ఉండే విధం గా చూసుకున్నారు. ఆఫీస్ మాత్రమే కాదు.. ఇల్లు కూడా అదే విధం గా ఉండేలా చూసుకున్నారు. డోర్ కర్టైన్స్, మాట్స్, ఫర్నిచర్, జ్యువలరీ, గాడ్జెట్స్, ఇంకా ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్స్ అన్ని రెడ్ అండ్ వైట్ కలర్ కాంబో లోనే తీసుకున్నారు. చివరకు వారు వాడే బైక్ అండ్ కార్ లను కూడా అదే కలర్ లో తీసుకున్నారు.

red and white family 2

ఒకవేళ, ఆ రంగులు దొరక్కపోతే ప్రత్యేకం గా తయారు చేయించుకుంటూ ఉంటారు. సెవెన్ రాజ్ కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరు కూడా అన్ని రెడ్ అండ్ వైట్ కలర్ లోనివే వాడతారు. వారు వేసుకునే దుస్తులు సైతం రెడ్ అండ్ వైట్ లోనే ఉండేలా చూసుకుంటారు. అలాగే సెవెన్ రాజ్ కి 7 అనే నెంబర్ ఇష్టం. ఇక ఆయన బండి పై కూడా 7 అనే నెంబర్ ఉంటుంది.

red and white family 4

ఇలా ప్రత్యేకం గా కలర్ ని వాడుతుండడం, నెంబర్ ని ఉండేలా చూసుకోవడం తో.. స్థానికం గా వారికీ సెలెబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. అయితే.. కొందరు ఇది కేవలం వ్యాపార స్ట్రాటజీ అని కూడా విమర్శిస్తూ వస్తున్నారు. ఎవరేమి అనుకున్నా సెవెన్ రాజ్ మాత్రం తన ఇష్టానికి తగ్గట్లు డిజైన్ చేసుకుంటున్నారు.