భర్త వల్ల సమస్యలు… ఆఖరికి బస్టాండ్ లో..? ఈ నటి జీవితం గురించి తెలిస్తే కన్నీరు ఆగవు..!

భర్త వల్ల సమస్యలు… ఆఖరికి బస్టాండ్ లో..? ఈ నటి జీవితం గురించి తెలిస్తే కన్నీరు ఆగవు..!

by Mounika Singaluri

Ads

ఒకప్పుడు ఆడవాళ్ళలో హాస్యనటులు చాలా తక్కువగా ఉండేవారు. ఉన్నవాళ్లలో తిరుగులేని హాస్య నటిగా పేరు తెచ్చుకుంది నటి గిరిజ. బ్లాక్ అండ్ వైట్ కాలంలో స్టార్ కమెడియన్గా, సెకండ్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది. కృష్ణాజిల్లాలో కంకిపాడు లో పుట్టిన ఈమె తల్లి, నటి దాసరి రామ తిలకం ప్రోద్బలం తో సినిమాల్లోకి అడుగు పెట్టింది.

Video Advertisement

పాతాళ భైరవి సినిమాలో నరుడా ఏమి నీ కోరిక అన్న ఒకే ఒక డైలాగ్ తో జనాలకు కలెక్ట్ అయిపోయింది. కాశీకి పోయాను రామాహరి అనే పాటతో ఆమెకి మరింత గుర్తింపు వచ్చింది.

struggles of this heroine

ఆ తర్వాత తిరుగులేని లేడీ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ఈమెకు రేలంగి సినిమా ఆఫర్లు ఇప్పించేవాడని, ఆమె కోసం ఒక ఇల్లు కూడా కొనిచ్చాడని, వాళ్ళ ఇద్దరి రిలేషన్ చాలా క్లోజ్ గా ఉండేదని అప్పట్లో అనుకునేవారు. నాలుగైదు మేడలు సంపాదించి, దర్జాగా కార్లలో తిరిగే గిరిజ జీవితం పెళ్లి తర్వాత అత్యంత దుర్భరంగా మారింది. సన్యాసిరావు అనే వ్యక్తిని తిరుపతిలో పెళ్లి చేసుకుంది.

struggles of this heroine

అయితే అతను ఖాళీగా ఉండటంతో అతని కోసం ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. భర్తతో కలిసి భలే మాస్టారు పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోయింది. కానీ భర్త మాత్రం తన దగ్గర ఉన్న ఆస్తిని నీళ్ళలా ఖర్చు పెట్టేవాడు. జల్సాలు చేస్తూ ఆస్తిని హారతి కర్పూరం చేసేసాడు. తాగిన మైకంలో గిరిజ మీద చేయి చేసుకుంటే ఆమెకి 14 కుట్లు పడ్డాయి. అలాగే కూతుర్ని కూడా ఏ రోజు చేరదీసిన పాపాన పోలేదు. నాన్న అని పిలిస్తే కాలితో తన్నేవాడు. ఆఖరికి ఒకరోజు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. తరువాత నటి గిరిజ జీవితం కష్టాల పాలయింది.

struggles of this heroine

చివరి రోజులలో కనీస అవసరాలకి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. డాన్స్ మాస్టర్ సురేష్ దాస మాటలలో గిరిజని ఒకరోజు దీనస్థితిలో చూశాను, ఆ తర్వాత కొద్ది రోజులకి బస్టాండ్ లో విగత జీవిగా చూశాను అని చెప్పుకొచ్చాడు. అయితే కూతురు శ్రీ గంగ మాత్రం తల్లి తన ఇంట్లోనే చనిపోయిందని ఇండస్ట్రీ నుంచి వచ్చి పలకరించిన ఒకే ఒక్క నటుడు అల్లు రామలింగయ్య అని, శోభన్ బాబు గారు ఫోన్లో పరామర్శించారని  చెప్పడం విశేషం.


End of Article

You may also like