Ads
చిన్నా.. పెద్దా.. వయసు తేడా లేకుండా.. ఆడ, మగా జెండర్ తేడా లేకుండా అందరు కూల్ డ్రింక్స్ ని ఇష్టపడతారు. ఏదైనా పార్టీ ఉందంటే చాలు కూల్ డ్రింక్స్ తప్పనిసరి. కేక్ కట్ చేసినా.. స్నాక్స్ ఎన్ని ఉన్నా ఓ కూల్ డ్రింక్ బాటిల్ కి మాత్రం తప్పకుండా ప్లేస్ ఇస్తాం. ఇక వేసవి వస్తే వీటిదే రాజ్యం. వేసవి కాలంలో వీటి అమ్మకాలు మరింత పెరుగుతాయి.
Video Advertisement
అయితే సుడాన్ లో గత కొన్ని నెలలుగా అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఈ కూల్ డ్రింక్స్ కంపెనీ లు ఇబ్బందుల్లో పడ్డాయి.. ఎందుకంటే పెప్సీ, కోకాకోలా ఇలా ఏం కూల్ డ్రింక్ అయినా తయారు కావాలంటే ప్రధానంగా వాడే పదార్థం గమ్ అరబిక్. ఇవే కాకుండా కాస్మొటిక్స్, కాండీస్ లో కూడా దీన్ని ప్రధానంగా వాడతారు.
సాఫ్ట్ డ్రింక్స్ తయారీలో ఈ పదార్థం లేకపోతే చాలా కష్టం. డ్రింక్ తయారు చేసేందుకు వాడే పదార్థాలన్నింటిని ఈ గమ్ అరబిక్ కలిపి ఉంచుతుంది. ఫలితంగా అవి రుచిని పొందుతాయి. ఒకవేళ డ్రింక్స్ లో ఈ గమ్ అరబిక్ వాడకపోతే.. పదార్థాలన్ని విడిపోయి.. ఎలాంటి రుచి లేకుండా చప్పగా ఉంటాయి. అయితే ఇది పేరుకు తగ్గట్టుగానే ఒక జిగురు. అకాసియా అనే చెట్టు నుంచి వచ్చే ఒకలాంటి జిగురు.
ఈ చెట్లు సుడాన్‌లో మాత్రమే ఉన్నాయి. అన్నీ దేశాలు ఇక్కడి నుంచే ఈ పదార్థాన్ని దిగుమతి చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల త్వరలోనే గమ్ అరబిక్‌కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని కూల్‌డ్రింక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కూల్ డ్రింక్ తయారీ కంపెనీలు. తమ ఉత్పత్తుల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సూడాన్‌లో మాత్రమే దొరికే ఈ గమ్ అరబిక్‌కు పదార్థాన్ని భారీ ఎత్తున సమకూర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. సూడాన్‌లోని సాహెల్ ప్రాంతం నుంచి సుమారు 70 శాతం గమ్ అరబిక్ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఓ నివేదిక ప్రకారం.. మరో 5-6 నెలల్లో గమ్ అరబిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని తెలుస్తోంది.
గమ్ అరబిక్ లేకపోతే పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజ కూల్ డ్రింక్ కంపెనీలు తమ ఉనికికి కాపాడుకోవడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు నిపుణులు. ఈ పదార్థానికి ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు. మరి ఈ అంతర్యుద్ధం ఇలానే కొనసాగితే.. రానున్న రోజుల్లో కూల్ డ్రింక్ ఉత్పత్తిపై భారీ ప్రభావం పడనుంది. ఇది పరోక్షంగా రానున్న కాలంలో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also read: కూల్ డ్రింక్స్ ని ఎప్పుడైనా గమనించారా..? పూర్తిగా ఎందుకు ఫిల్ చేయరు..? దీని వెనుక అసలు కారణం ఇదే..!
End of Article