ముఖ్యమంత్రికి సుధామూర్తి లెటర్ ఇదే…కరోనా గురించి అది నిజం కాదు…!

ముఖ్యమంత్రికి సుధామూర్తి లెటర్ ఇదే…కరోనా గురించి అది నిజం కాదు…!

by Anudeep

కర్ణాటకలో మొట్టమొదటి కరోనా మృతి కేసు నమోదవడంతో దేశ వ్యాప్తంగా కలకలం స్టార్టయింది. ఇప్పటికి కరోనా వైరస్ గురించి ఎన్నో మెసేజ్లు , వార్తలు మీడియాలో , సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఏది నిజమో, ఏది ఫేక్ న్యూసో అర్దం కాక జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నా పరిస్థితి. ఇదే విషయం పైన ఇన్ఫోసిస్ అధినేత సుధా మూర్తి కర్ణాటక ప్రభుత్వానికి కొన్న సూచనలు చేస్తూ ముఖ్యమంత్రికి ఒక లేఖ రేశారు. ఆ లేఖలో ఏం రాసారో మీరూ చదవండి.

Video Advertisement

కర్ణాటకకు చెందిన 79 ఏళ్ల సిధ్దికి మొట్టమొదటి కరోనా మృతి కేసు, ఢిల్లీకి చెందిన 60ఏళ్ల మహిళ కూడా కరోనా సోకి చనిపోయిందని సమాచారం. వీటితో వృద్దులే జాగ్రత్తగా ఉండాలనే మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ అవతుంది. మొన్నటి వరకు మన దగ్గర ఉష్ణోగ్రతకి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదు అనేది ఒకటి సర్క్యులేట్ అయింది. ఇందులో నిజం లేదనే విషయాన్ని ప్రస్తావించారు సుధా మూర్తి.

సింగపూర్, ఆస్ట్రేలియాల్లో ఏడాది పొడవునా ఎండలు విపరీతంగా ఉంటాయి. అయినప్పటికి ఆయా దేశాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. దీన్ని బట్టి మన దగ్గర కరోనా వైరస్ వ్యాప్తి చెందదు అనేదాంట్లో నిజం లేదని అన్నారు.

ఎసి వాడే ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి చెందేందుకు అవకాశాలున్నాయని, కావున మాల్స్, సినిమాహాల్స్ కొద్ది రోజులు మూసేయాలని సూచించారు. ప్రజలకు అత్యవసరం అయిన పెట్రోల్,నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ లాంటి షాపులని అందుబాటులో ఉంచాలని అన్నారు. పిల్లలకు స్కూల్స్ , కాలేజిలకు సెలవులు ఇవ్వడం మంచిదని అన్నారు.

అలాగే కరోనా వ్యాప్తి చెందితే ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రి కూడా ఆ కేసెస్ ని టేకప్ చేయడానికి ముందుకు రాదని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఒక ప్రభుత్వాసుపత్రిని ఖాళీ చేసి,500-1000 పడకలు ఏర్పాటు చేయించాలని, అదేవిధంగా ఆక్సిజన్ పైప్ లైన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వానికి సాయం చేయడానికి ఇన్పోసిస్ సంస్థ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని తన లేఖలో తెలిపారు. సుధామూర్తి చేసిన సూచనలను, ఇన్ఫోసిస్ సాయం తీసుకోవడానికి అంగీకరించారు కర్ణాటక హెల్త్ మినిస్టర్ దేవీ శెట్టి.

కరోనా మృతి కేసు నమోదవడంతో కర్ణాటక ప్రభుత్వం స్కూల్స్ కాలేజిలకు సెలవులు ఇచ్చేసింది. పిల్లలకు పరీక్షలు కూడా మార్చి నెలాఖరున ఉంటాయని ప్రకటించింది. పెళ్లిల్లు, మీటింగులు లాంటి జనసందోహాం ఉండే కార్యక్రమాలని అవాయిడ్ చేయాలని ప్రజలకు సూచించింది. అలాంటి కార్యక్రమాలు ఇప్పట్లో ఏర్పాటు చేయకూడదని ప్రకటించింది.


You may also like