Ads
- చిత్రం : వాంటెడ్ పండుగాడ్
- నటీనటులు : సునీల్, అనసూయ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, సుడిగాలి సుధీర్
- నిర్మాత : వెంకట్ కోవెలమూడి,సాయిబాబ కోవెలమూడి
- దర్శకత్వం : శ్రీధర్ సీపాన
- సంగీతం : పి.ఆర్
- విడుదల తేదీ : ఆగస్ట్ 19, 2022
Video Advertisement
స్టోరీ :
ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్ పండుగాడు ( సునీల్). ఈ కథ జైలు నుండి తప్పించుకున్న పండు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది, అతన్ని పట్టుకున్న వారికి 1 కోటి బహుమతిని అందిస్తామని పోలీసు డిపార్ట్‌మెంట్‌ను ప్రకటించడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. తదనంతరం ఆ ప్రకటన చూసి రివార్డ్ గురించి తెలుసుకుని చాలామంది పండు కోసం వెతకడం ప్రారంభిస్తారు, అయితే రిపోర్టర్లుగా పనిచేస్తున్న సు (సుధీర్) మరియు డి (దీపిక పిల్లి) పండు ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అభ్యంతం కామెడీతో సాగే ఈ సినిమాలో చివరికి పండును ఎవరు పట్టుకుంటారు అనేది మాత్రం తెరమీద చూసి తీరాల్సిందే.
రివ్యూ :
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గారి సమర్పణలో రూపొందించిన చిత్రం వాంటెడ్ పండుగాడ్ ఈరోజు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు కనువిందు చేయడానికి వచ్చింది. ఈ చిత్రం కామెడీ యాంగిల్ లో సాగినప్పటికీ అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పవచ్చు. సాంకేతికంగా, మహి రెడ్డి యొక్క విజువల్స్ యావరేజ్‌గా ఉన్నాయి. పిఆర్ సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో సినిమాలో పాటలు ఊహించినంత కిక్కు ఇవ్వలేకపోతున్నాయి. సాంకేతిక విభాగం సినిమా అవసరాలు తీర్చడానికి తమ వంతు కృషి చేసినప్పటికీ అనుకున్నంత ఫలితాలు రాలేదనే చెప్పవచ్చు. ఈ చిత్రం టీవీ స్కిట్స్ ఇష్టపడే వారికి మాత్రం బాగా నచ్చే రొటీన్ కామెడీ డ్రామా.
ప్లస్ పాయింట్స్ :
- భారీ తారాగణం
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథ
- టీవీ స్కిట్ లాగా అనిపించే కొన్ని సీన్స్
- పేలవమైన పాటలు మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్
- సాగదీస్తున్నట్లుగా ఉండే నాన్ సింక్ కామెడీ సన్నివేశాలు.
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సినిమా మొత్తం కామెడీ యాంగిల్ లో సాగుతుంది. కథాకథనం పెద్దగా ఆశించక పోవడమే మంచిది. ఈ చిత్రంలో స్కిట్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి టీవీలో వచ్చే స్కిట్స్ నచ్చే వారికి అందరికీ ఈ చిత్రం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.
End of Article