PRASANNA VADANAM REVIEW : “సుహాస్” ఈ సినిమాతో మరొక హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

PRASANNA VADANAM REVIEW : “సుహాస్” ఈ సినిమాతో మరొక హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సుహాస్, ఇప్పుడు ప్రసన్న వదనం సినిమాతో పలకరించారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : ప్రసన్న వదనం
  • నటీనటులు : సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, నితిన్ ప్రసన్న.
  • నిర్మాత : మణికంఠ జె ఎస్, ప్రసాద్ రెడ్డి టి ఆర్
  • దర్శకత్వం : అర్జున్ వై కె
  • సంగీతం : విజయ్ బుల్గానిన్
  • విడుదల తేదీ : మే 3, 2024

prasanna vadanam movie review

స్టోరీ :

సూర్య (సుహాస్) ఆర్జే గా పనిచేస్తూ ఉంటాడు ఒక ప్రమాదంలో తన తల్లిదండ్రులని కోల్పోతాడు. అదే ప్రమాదంలో సూర్య తలకి దెబ్బ తగులుతుంది. ఆ గాయంలో సూర్యకి ఎదుటి వ్యక్తుల ముఖాలను గుర్తుపట్టలేని డిజార్డర్ వస్తుంది. దాన్ని ఫేస్ బ్లైండ్ నెస్ డిసార్డర్ అని అంటారు. ఒకరోజు సూర్య కళ్లెదురుకుండానే అమృత (సాయి శ్వేత) అనే ఒక అమ్మాయిని లారీ కిందకు తోసి చంపేస్తారు.

prasanna vadanam movie review

ముఖాలు సరిగ్గా కనిపించని కారణంగా సూర్య ఆ అమ్మాయిని ఎవరు చంపారు అనే విషయం తెలుసుకోలేకపోతాడు. కానీ ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అని అనుకుంటాడు. తర్వాత సూర్య ఏం చేశాడు? అసలు అమృతని ఎవరు చంపారు? అమృతని చంపిన వాళ్ళని సూర్య పట్టుకున్నాడా? సూర్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

prasanna vadanam movie review

రివ్యూ :

సినిమా కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. తెర మీద కూడా అంతే కొత్తగా సినిమాని ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా నడుస్తుంది. సూర్య జీవితాన్ని ఇందులో చూపిస్తారు. సూర్య ఒక అమ్మాయిని ప్రేమించడం, కొన్ని కామెడీ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ సాగిపోతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కథ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. కానీ ఎమోషన్స్ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది.

prasanna vadanam movie review

ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సుహాస్ డిఫరెంట్ పాత్రలని ఎంచుకుంటున్నారు. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక డిఫరెంట్ పాత్ర పోషించారు. తన పాత్రలో సుహాస్ బాగా నటించారు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కూడా తనకి ఇచ్చినంత వరకు బాగా చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు బాగున్నాయి. ఎస్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ కూడా హైలైట్ గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఇంకా బాగుండేది అనిపిస్తుంది.

prasanna vadanam movie review

ప్లస్ పాయింట్స్ :

  • కాన్సెప్ట్
  • సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్
  • పాత్రలని రాసుకున్న విధానం
  • నటీనటుల పర్ఫార్మెన్స్

మైనస్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
  • సాగదీసినట్టుగా ఉండే కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఈ సినిమా నిరాశపరచదు. మంచి కాన్సెప్ట్ ని అంతే బాగా తెర మీద చూపించారు. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఇటీవల కాలంలో వచ్చిన మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా ప్రసన్న వదనం సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగితో సమోసాలు అమ్మే కుర్రాడి సంభాషణ ఇది…5 నిముషాలు మాట్లాడే సరికి అతని పరిస్థితి అర్ధమయ్యింది!


End of Article

You may also like