Ads
- చిత్రం : రైటర్ పద్మభూషణ్
- నటీనటులు : సుహాస్, టీనా శిల్పారాజ్, గౌరీ ప్రియారెడ్డి, అశిష్ విద్యార్థి, రోహిణి
- దర్శకత్వం : షణ్ముక్ ప్రశాంత్
- నిర్మాత : చంద్రు మనోహరన్
- సంగీతం : శేఖర్ చంద్ర
- విడుదల తేదీ : ఫిబ్రవరి 03, 2023
స్టోరీ :
Video Advertisement
రైటర్ పద్మభూషణ్ (సుహాస్) విజయవాడలో లైబ్రేరియన్ గా జాబ్ చేస్తుంటాడు. పద్మభూషణ్ తండ్రి(ఆశిష్ విద్యార్ధి), తల్లి సరస్వతి(రోహిణి) అతనికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. ఐతే, పద్మభూషణ్ మాత్రం గొప్ప రైటర్ కావాలని కలలు కంటూ తొలి అడుగు అని ఒక బుక్ రాస్తాడు. పేరెంట్స్ కి తెలియకుండా అప్పుచేసి మరీ తన బుక్ ని పబ్లిష్ చేయిస్తాడు. అయితే ఆ బుక్ ని జనాలు కొనేలా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు.
మరో వైపు కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పద్మభూషణ్ లైఫ్ లోకి అతని మరదలు సారిక (టీనా శిల్పారాజ్) ఎంటర్ అవుతుంది. అప్పటి నుంచి తనకు ఎదురైనా ఒక సమస్యని పద్మభూషణ్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే ఈ సినిమా.
రివ్యూ :
ఇంట్లోని ఆడవారికి ఇష్టాలను, అభిరుచులను గౌరవించాలి అనే కోణంలో దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్ ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషన్ తో పాటు గుడ్ ఫన్ ను చూపించారు. ప్రధాన పాత్రల మధ్యలోనే అన్ని రకాల ఎమోషన్స్ పండించడం లో సఫలం అయ్యాడు. మొత్తానికి సినిమాలో వాస్తవ పరిస్థితులు.. అలాగే సగటు మిడిల్ క్లాస్ భావోద్వేగాలు బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ సన్నివేశాలు బాగున్నాయి.
కలర్ ఫోటోతో ఇప్పటికే హీరోగా ప్రూవ్ చేసుకున్న సుహాస్ మరోసారి తనలో ఉన్న నటనని బయట పెట్టాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా నేటి యూత్ అంతా వీడెవడో మనలాగే ఉన్నాడే అనుకునే విధంగా సుహాస్ నటన ఉంది. ఇక టీనా శిల్ప రాజ్ తన పాత్ర పరిధిలో నటించింది. అయితే కన్నా అనే పాత్రలో నటించిన గౌరీ ప్రియ మాత్రం అదరగొట్టేసింది. ఇక ఎప్పటిలాగే రోహిణి, ఆశిష్ విద్యార్థి తమ అనుభవాన్ని రంగరించి నటించారు. వారి పాత్రలు ఈ చిత్రానికి ఒక ప్లస్.
దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన రాసుకున్న క్లైమాక్స్ కూడా బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- ప్రధాన పాత్రల నటన
- క్లైమాక్స్
- ఎమోషనల్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
- స్లో నరేషన్
- కొన్ని బలహీన సన్నివేశాలు
- స్క్రీన్ ప్లే
రేటింగ్ :
3 .25 /5
ట్యాగ్ లైన్ :
విభిన్న చిత్రాలను ఇష్ట పడేవారికి రైటర్ పద్మభూషణ్ నచ్చుతుంది. ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్ తో పాటు.. కుటుంబ అనుబంధాలు..భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి అనుభూతిని పొందుతారు.
watch trailer :
End of Article