“చై సామ్ కు వారసుడు పుట్టేదాకా ఆగు” అని సుమక్క కౌంటర్… విష్ణుప్రియ ఆన్సర్ ఏంటంటే.?

“చై సామ్ కు వారసుడు పుట్టేదాకా ఆగు” అని సుమక్క కౌంటర్… విష్ణుప్రియ ఆన్సర్ ఏంటంటే.?

by Anudeep

Ads

టివి షో అంటేనే ఎంటర్టైన్మెంట్. ఈ షో లలో రకరకాలుగా గేమ్స్ ఆడుతూ.. ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఉంటారు బుల్లితెర నటులు. తాజాగా.. మా టివి లో ప్రసారం అయ్యే స్టార్ మ్యూజిక్ షో లో యాంకర్లు శ్రీముఖి, విష్ణుప్రియ గెస్ట్ లు గా వచ్చి సందడి చేసారు. ఈ షో కి సుమ హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ గేమ్ లో భాగం గా విష్ణుప్రియ కు పాతికవేలు గెలుచుకునే ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సమయం లోనే విష్ణుప్రియ తన ప్రేమ విషయాన్నీ చెప్పేసింది.

Video Advertisement

vishnu priya 2

ఈ గేమ్ లో భాగం గా ఏ, బి,సి,డి అనే స్టాండ్స్ ఉంటాయి. వాటిలో “ఏ” అనే స్టాండ్ పై పాతికవేల క్యాష్ ఉన్న సూట్కేస్ ను ఉంచారు. వీటిలో ఏ సూట్కేస్ లో క్యాష్ ఉంటాయో ఆడవారికి తెలియదు. బయటనుంచి చూస్తున్న శ్రీముఖి మాత్రం విష్ణుప్రియ కచ్చితం గా “ఏ” అనే సూట్కేస్ నే తీసుకుంటుంది. ఎందుకంటే దాని ఏ అనే లెటర్ అంటే పిచ్చి.. అని చెప్పింది.

vishnupriya 1

శ్రీముఖి చెప్పినట్లే.. విష్ణుప్రియ “ఏ” అనే సూట్కేస్ ను తీసుకుని పాతికవేల రూపాయలను సొంతం చేసుకుంది. అయితే, బయటకొచ్చాక.. ” ఏ” అనే సూట్కేస్ నే ఎందుకు తీసుకున్నావ్ అంటూ సుమ విష్ణుప్రియని అడుగగా.. తనకు “ఏ” అనే లెటర్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇంతకీ “ఏ” అంటే ఏంటి అని అడగ్గా “అక్కినేని” అని సమాధానం ఇచ్చింది.

vishnu priya 3

అక్కినేని వారసుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని సుమ అడిగింది. దానికి కూడా విష్ణు ప్రియా అవును అని సమాధానం ఇచ్చింది. అయితే.. చై సామ్ లకు వారసుడు పుట్టేవరకు ఆగు అంటూ సెటైర్ వేసింది సుమ. వెంటనే అందుకున్న విష్ణు ప్రియా “ఎందుకూ.. అఖిల్ ఉన్నాడు గా..” అంటూ అఖిల్ పై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టేసింది.


End of Article

You may also like