హీరోగా 3 కోట్లు తీసుకున్న సునీల్… ఇప్పుడు కమెడియన్, విలన్ గా మారిన తర్వాత ఎంత తగ్గించేశారంటే.?

హీరోగా 3 కోట్లు తీసుకున్న సునీల్… ఇప్పుడు కమెడియన్, విలన్ గా మారిన తర్వాత ఎంత తగ్గించేశారంటే.?

by Mounika Singaluri

Ads

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగాడు సునీల్. తర్వాత హీరోగా కూడా రెండు మూడు సినిమాలు హిట్ కొట్టాడు. కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాడు. ప్రస్తుతం మళ్లీ విలన్ గా చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు సునీల్. ఒకప్పుడు సునీల్ కోసమే సినిమాలకి వెళ్లిన ప్రేక్షకులు చాలా మంది ఉండేవారు.

Video Advertisement

ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగిన సునీల్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకున్నాడు. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్స్ కి కూడా గట్టి కాంపిటేషన్ ఇచ్చాడు.

అయితే కమెడియన్ గా కెరియర్ పీక్స్ లో ఉండగానే హీరోగా మారి తన సక్సెస్ఫుల్ కెరీర్ ని డిస్టర్బ్ చేసుకున్నాడు.అటు హీరోగాను సక్సెస్ కాలేక ఇక్కడ ఇటు కామెడీ రోల్స్ కూడా ఎవరు ఇవ్వక దాదాపు కెరియర్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చాడు. అయితే మళ్లీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన సునీల్ విలన్ గా రాణిస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాలో సునీల్ విలనిజం పండించిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది. తర్వాత పుష్ప టు, జైలర్ సినిమాలలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు సునీల్.

ప్రస్తుతం తమిళంలో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అక్కడ కూడా కమెడియన్ గా, విలన్ గా వరుస అవకాశాలు ఆయన కెరీయర్ ని మళ్లీ పునర్నిర్మిస్తున్నాయి. లేటెస్ట్ తమిళ్ మూవీ ఆంటోనీ లో కూడా సునీల్ నటించిన మెప్పించాడు. అయితే సునీల్ హీరోగా నటించిన టైంలో మూడు నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేసేవాడట, అప్పట్లో అది చాలా పెద్ద డిమాండ్ అని అనుకోవాలి.

కానీ ఇప్పుడు కమెడియన్ గా విలన్ గా మారిన తరువాత రెమ్యూనరేషన్ విషయంలో సునీల్ కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో 40 లక్షల వరకు ఇస్తున్నారని అయితే తమిళంలో ఎక్కువ సినిమాలు చేయటం, అక్కడ సునీల్ కి డిమాండ్ పెరుగుతూ ఉండటంతో 60 నుంచి 80 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సినీ వర్గాల టాక్. తమిళం లో ఇతని క్రేజ్ పెరిగితే ముందు ముందు మళ్ళీ మూడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.


End of Article

You may also like