ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా సూపర్ హిట్ అయిన బాలయ్య సినిమా ఏదో తెలుసా..?

ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా సూపర్ హిట్ అయిన బాలయ్య సినిమా ఏదో తెలుసా..?

by Anudeep

Ads

బాలయ్య సినిమా అంటేనే మాస్ ఆడియన్స్ కి పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. పక్కా మాస్ ను ఎంటర్టైన్ చేసే ఫైట్ సీన్స్ బాలయ్య సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే.. ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా బాలయ్య నటించిన సినిమా ఒకటి ఉందని తెలుసా..? అది కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని తెలుసా..?

Video Advertisement

ఆ సినిమా ఏంటో..? ఆ సినిమా దర్శకుడు ఎవరో..? హీరోయిన్ గా ఎవరు నటించారు..? ఆ సినిమా ఫైట్ సీన్స్ లేకపోయినా ఎందుకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

1 balayya

ఆ సినిమా “నారి నారి నడుమ మురారి..”. ఈ సినిమా 1990 లో థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు కోదండ రామి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా శోభన, నిరోషా నటించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. కాగా.. ఈ సినిమాలోని చాల వరకు ఇంపార్టెంట్ సన్నివేశాలను తమిళనాడులో వేలచెర్రి అనే ప్రాంతంలో షూట్ చేసారు.

యువ చిత్ర పతాకం బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారం అయితే చాలా మందే చూస్తారు. ఈ సినిమాలో ఒక్క ఫైట్ లేదా డాన్స్ స్టెప్ కూడా లేకుండా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నారు. 1990 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో బాలయ్య బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ లో మరింత విశేష ఆదరణ లభించింది.


End of Article

You may also like