Super Machi Review : ఈ సంక్రాంతికి సూపర్‌ మచ్చితో “కళ్యాణ్ దేవ్” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Super Machi Review : ఈ సంక్రాంతికి సూపర్‌ మచ్చితో “కళ్యాణ్ దేవ్” హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Megha Varna

Ads

  • చిత్రం : సూపర్‌ మచ్చి
  • నటీనటులు : కల్యాణ్ దేవ్, రచిత రామ్, వీకే నరేష్, పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, మహేష్ ఆచంట.
  • నిర్మాత : రిజ్వాన్
  • దర్శకత్వం : పులి వాసు
  • సంగీతం : తమన్‌
  • విడుదల తేదీ : జనవరి 14, 2022.

Video Advertisement

స్టోరీ :

మీనాక్షి (రచిత రామ్), ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తూ ఉంటుంది. హీరో (రాజు) బార్లో పాటలు పాడుకుంటూ ఆవారాగా ఉంటాడు. మీనాక్షి రాజుని చూడడం… ఇష్టం కలగడం.. దీనితో ఆమె వెంటపడుతూ ఉంటుంది. రాజు ఇష్టం లేదని చెప్పేస్తాడు. కానీ అయినా సరే ఆమె వెంటపడుతూ ఉంటుంది. ఎలా అయినా సరే వదిలించుకోవాలని అనుకుంటాడు రాజు. దాంతో, ఒక నైట్‌ తనతో గడిపితే నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తానని అంటాడు. అయితే, మంచి ఉద్యోగం చేసే అమ్మాయి ఆవారాలా తిరిగే అతన్ని ఎందుకు ప్రేమిస్తుంది..?, రాజు మీనాక్షి ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చెయ్యడు..?, మీనాక్షిని చూడకుండా ప్రేమించిదెవరు? మీనాక్షి తండ్రి ఆఖరి కోరిక ఏమిటి..?, ఆఖరికి వీళ్ళు ఒకటవుతారా..? ఇదే కథ.

 

రివ్యూ :

విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమాతో ఇప్పుడు వచ్చాడు. ఈ సినిమా మొత్తం ప్రేమ, ఎమోషన్స్, తండ్రి-కూతురు సెంటిమెంట్ తో నడుస్తుంది. చూడకుండా ప్రేమించుకోవడం అనేది ఆసక్తికరమైన పాయింట్ అని చెప్పవచ్చు. దర్శకుడు నిజంగా అద్భుతమైన పాయింట్ తో సినిమాని తీసుకువచ్చారు. మొదటి హాఫ్ అంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రాజుని ఎందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగి మీనాక్షి ప్రేమిస్తుంది అనేది ఇంటర్వెల్ వరకు ఉండి… అక్కడ ఆపడంతో ప్రేక్షకులకి క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది.

అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం సాధారణంగానే కథ ఉంటుంది. దర్శకుడు పులి వాసు తెర మీదకి సినిమా తీసుకొచ్చిన తీరు అద్భుతంగా ఉంది. అలాగే సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. తమన్ సంగీతం ఈ సినిమాలో బాగుంది. పాటలు కొంచెం సోసో గా ఉన్నా నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. నటీనటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. వాళ్ళని ఎంపిక చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని రిచ్ గా తెరకెక్కించిన తీరు కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. కథనం విషయాల్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

  • ఎమోషనల్ సీన్స్
  • సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్:

  • నేరేషన్ లో కొన్ని లోపాలు
  • ప్రెజెంటేషన్ తగ్గింది

రేటింగ్:

2.5/5

ట్యాగ్ లైన్:

ఈ సినిమా ప్రేక్షకులని నిరాశ పరచదు. కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా అనిపిస్తోంది. అలానే కొన్ని సీన్స్ లో డెప్త్ తగ్గింది.


End of Article

You may also like