Ads
ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా కృష్ణ మొదటి భార్య, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి సైతం అనారోగ్యంతో కన్నుమూశారు.
Video Advertisement
ఇందిరాదేవి గారు చనిపోయిన కొద్ది రోజులకే కృష్ణ గారు కూడా చివరి శ్వాస విడిచారు. ఇప్పుడు వారి లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
కృష్ణ చాలా చక్కగా నిర్ణయాలను తీసుకుంటారట. ఇక అసలేం అయ్యిందనేది చూస్తే.. కృష్ణ కూతురికి గల్లా జయదేవ్‌తో పెళ్లి కుదిరింది. అందరినీ ఆహ్వానించారు కూడా. చెన్నై లో ఈ పెళ్లి జరిగింది. కృష్ణ ఏపీలోని రాజకీయ ప్రముఖులని పెళ్లి కి ఆహ్వానించారు. అలానే తమిళనాడు సీఎం జయ లలితని కూడా పిలిచారు. వీళ్లిద్దరు గూఢాచారి 116, నిలుపు దోపిడి తదితర సినిమాల్లో అప్పటికే నటించారు. దీని మూలంగా పెళ్లి కి జయ లలిత వస్తానని అన్నారట.
పెళ్లి కి మూడు రోజులు ముందు కృష్ణ ఇంటికి జయ లలిత సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మొదట మూడు వరసల సీట్లు కావాలని అన్నారట. దీనికి మాత్రం కృష్ణ ఒప్పుకోలేదు. కృష్ణ ఒప్పుకోక పోవడానికి కారణం ఆయన తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులని పెండ్లికి పిలిచారు. వాళ్ళని వదిలేసి ఐలా జయ లలిత కోసం మొదట మూడు వరుసలు వదిలేయడం మంచిది కాదనుకున్నారట. అందుకు ఆయన ఆమెకి ఫోన్ చేసి పెళ్ళికి రావద్దని..మీ ఆశీర్వాదం ఉంటే చాలని అన్నారట. జయ లలిత కూడా ఏమి ఫీల్ అవ్వలేదు. వధూవరులకు ఓ బొకెని పెండ్లి నాడు పంపించారట.
End of Article