“నిజామాబాద్” హాస్పిటల్ లో పేషంట్ ని ఈడ్చుకెళ్లడంపై స్పందించిన సూపరింటెండెంట్..! ఏం అన్నారంటే..?

“నిజామాబాద్” హాస్పిటల్ లో పేషంట్ ని ఈడ్చుకెళ్లడంపై స్పందించిన సూపరింటెండెంట్..! ఏం అన్నారంటే..?

by kavitha

Ads

నిజామాబాద్ జిల్లాలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో సరి అయిన వైద్య సౌకర్యాలు లేవనే విషయం బయటపడింది. ఆ ఆస్పత్రిలో స్ట్రెచర్ లేకపోవడంతో పెషెంట్ ను అతని బంధువులు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

Video Advertisement

ప్ర‌భుత్వ హాస్పటల్స్ ను కార్పోరేట్ హాస్పటల్స్ కు సమానంగా మార్చమని తెలంగాణ గవర్నమెంట్ చెబుతూ వస్తోంది. క్షేత్ర స్థాయ‌లో అయితే ప్రభుత్వం చెప్పిన స్థాయిలో లేదు. కొన్ని ఆస్పత్రులలో అయితే కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని చెప్పవచ్చు.

relatives-dragged-patient-by-pulling-his-legs1

న్యూస్ 18 తెలుగు  కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుప‌త్రికి రోజు వందలాది మంది పేషంట్స్ వ‌స్తుంటారు. ఈ క్రమంలో గత నెల మార్చి 31 నాడు అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని గవర్నమెంట్ జనరల్ ఆసుప‌త్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే ఓపీ దగ్గరలో కూర్చోబెట్టారు. కానీ ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటం వల్ల ఆ వ్యక్తి రాత్రి అక్కడే ఉన్నాడు. తరువాతి రోజుఅంటే ఏప్రిల్ 1న పొద్దున ఓపీ మొదలైన, అతని బంధువులు ఓపీలో చూపించారు.

వారు ఆ వ్య‌క్తిని రెండో అంతస్తులో డాక్టర్ వద్దకు తీసుకెళ్లమని రాసిచ్చారు. దాంతో ఆ వ్యక్తిని లిఫ్ట్ వద్దకు తీసుకొని వెళ్లాలంటే స్ట్రెచర్ అవసరం. కానీ అక్కడ స్ట్రెచర్ అందుబాటులో లేకపోవటంతో బంధువులు అతని కాళ్లు పట్టుకొని లిఫ్ట్ వద్దకు లాక్కొని వెళ్లారు. దాంతో ఆ దృశ్యాన్ని ఆస్పత్రిలోని వారు చూసి ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది చూసి కూడా పట్టించుకోలేదు.
అలా ఆ వ్యక్తిని రెండో అంతస్తుకు తీసుకొనివెళ్ళిన తరువాత అక్కడ కూడా వీల్ చైర్, స్ట్రెచర్ అందుబాటులో లేదు.

relatives-dragged-patient-by-pulling-his-legs1

దాంతో లిఫ్ట్ దగ్గర నుండి డాక్టర్ రూమ్ వరకు మళ్ళీ కాళ్లు పట్టుకొని లాక్కెళ్లారు. అయితే దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా గవర్నమెంట్ హాస్పటల్స్ లో వసతులు ఏర్పాటు చేస్తున్నప్పటికి, ఆసుపత్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం వల్ల రొగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో వైద్య సిబ్బంది పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈ సంఘటన పై  స్పందించారు. అది జరిగి 15 రోజులు అవ్వుతుందని, మీడియాలో వచ్చేవరకు తెలియదని, 10 సెకండ్స్ మాత్రమే అలా లాక్కెళ్లరని, సిబ్బంది చూసి వెంటనే అలర్ట్ అయ్యారని తెలిపారు. దానికి సంబంధించిన విజువల్స్ తమ దగ్గర  ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

watch video :

Also Read: అమ్మా నాన్న నన్ను క్షమించండి..! నేను మళ్ళీ తిరిగి వస్తాను..!


End of Article

You may also like