Ads
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను దుఖంలోకి నెట్టింది. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక కుమారుడు మహేష్ బాబు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆయనకి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.
ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయిన మహేష్ తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది అన్నను, తల్లిని, తండ్రిని కోల్పోవడాన్ని మహేష్ బాబుకి తీరని బాధే. మహేష్ కు చిన్నాన్న ఆదిశేషగిరిరావు తోడుగా ఉన్నారు. ఆదిశేషగిరిరావు తన అన్న అయిన కృష్ణతో 70 ఏళ్లపాటు కలిసి ప్రయాణం చేసారు. ఆదిశేషగిరిరావు సైతం అన్నయ్య లేరనే నిజాన్ని నమ్మలేక బాధపడుతున్నారు. వైద్యులు కృష్ణకు గుండెపోటుతో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పారు. దాని కోసం వైద్యం చేస్తున్నామని చెప్పారు. అయితే ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అని అంతా అనుకుంటున్నారు. మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడానిక ముందు అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఈ విషయం గూర్చి వివరణ ఇచ్చారు. కృష్ణ చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు. తనతో ఏం మాట్లాడారు,ఆ తర్వాత ఏమైంది అని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ చనిపోయిన ముందురోజు ఆదివారం,ఆరోజున పొద్దునే ఆదిశేషగిరి రావు కృష్ణ దగ్గరకు వెళ్లారట. కృష్ణతో రెండు గంటలకు పైగా గడిపారంట, ఆ సమయంలో కృష్ణ చిన్నప్పటి సంగతులు చాలా చెప్పారని, సైకిల్ పై ఇద్దరూ సినిమాలకెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారట. ఆ మాటలు మాట్లాడుతూ ఇద్దరూ బాగా నవ్వుకున్నారని, సినిమాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో కృష్ణలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని ఆదిశేషగిరి రావు చెప్పారు. కృష్ణ ఆ సమయంలో చాలా హుషారుగా కనిపించారని, ఇంట్లోనే భోజనం చేసి వెళ్లమని కృష్ణ అడిగినప్పటికీ, వేరే వాళ్లను భోజనానికి ఇంటికి రమ్మన్నని చెప్పాను. అయితే ఇంకోసారి లంచ్‌కి రా అని అన్నారు. ఆ తరువాత ఇంటికి వచ్చేశానని ఆదిశేషగిరిరావు తెలిపారు.ఆదివారం రోజు రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తరువాత అన్నయ్యకి 12.30కి గుండెపోటు వచ్చిందని చెప్పారు. అన్నయ్యకు గురకపెట్టే అలవాటు ఉంది. గదిలో నుండి గురక శబ్దం వినిపించకపోయేసరికి అన్నయ్య అవసరాలు చూసుకునే కుర్రాడికి అనుమానం వచ్చి పల్స్ చెక్ చేసి, ఏదో తేడాగా అనిపించేసరికి ఫోన్ చేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని, ఆ తర్వాత నేను వెళ్లా. కానీ అన్నయ్యకి గుండెపోటు వచ్చి అప్పటికే ముప్పైనిమిషాలు అవడంతో అవయవాల మీద ఆ ప్రభావం పడింది. రక్త ప్రసరణ కూడా ఆగిపోయింది. వైద్యులు 30 గంటలకు పైగా వైద్యం చేశారు.అయిన కూడా ఫలితం లేకపోయిందని ఆదిశేషగిరిరావు తెలిపారు.
Video Advertisement
End of Article