చిరంజీవిని సురేఖ గారు ఏ సినిమా సమయంలో చూసి ఇష్టపడ్డారో తెలుసా.?

చిరంజీవిని సురేఖ గారు ఏ సినిమా సమయంలో చూసి ఇష్టపడ్డారో తెలుసా.?

by Sunku Sravan

Ads

కళామ్మతల్లి ఒడిలో నిలదొక్కుకోవాలంటే ముందుగా ఉండాల్సింది ఓపిక, కష్టం. ఈ రెండు అలవాట్లు ఉంటే సినీ ఇండస్ట్రీలో ఏ విధంగానైనా నెట్టుకు రావచ్చు. దీంతోపాటుగా గుమ్మడికాయఅంత కష్టం ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు పెద్దలు. కానీ చిరంజీవి తన అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకున్నాడు. 1978లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతూ చరిత్ర సృష్టించారు.

Video Advertisement

పునాదిరాళ్లు సినిమాతో తన జీవిత గమనానికి పునాది వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా హిట్లు, ఫ్లాపులతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు.1978 ఫిబ్రవరి 11వ తేదీన పునాదిరాళ్లు సినిమాతో మొట్టమొదటిసారిగా అలనాటి మేటి నటి సావిత్రితో నటించే అవకాశాన్ని పొందాడు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నరసింహ రాజు మరియు చిరంజీవి ముగ్గురు కాళ్ళు కడుక్కొని హీరోయిన్ సావిత్రి ఉన్న ఇంటికి వెళ్ళాలి.

చిరంజీవి చాలా తెలివిగా ముందుగానే కెమెరామెన్ దగ్గరికి వెళ్లి, దానికంటే ముందు సీన్ ఏంటో అడిగి తెలుసుకున్నారు. అప్పుడే పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తానని చెప్పడంతో, వెంటనే చిరంజీవి కొన్ని గడ్డిపోచలను తలపై, చొక్కాపై వేసుకుని ఇంటి ముందున్న తొట్టిలో నీళ్లను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళారు. మిగతా నలుగురు కూడా షాట్ రెడీ అనగానే వచ్చి నిలిచి ఉన్నారు.

దీన్ని గమనించినటువంటి కెమెరామెన్ నివాస్ చిరంజీవితో వారిలా కాకుండా నువ్వు మాత్రం ముందుగానే సీన్ గురించి తెలుసుకొని మరి నటించావు అంటూ నువ్వు సినిమా ఫీల్డ్ లో సక్సెస్ అవుతావని ఆ టైంలో కితాబు ఇచ్చారు. ఈ మూవీ విడుదల చాలా సమయం కావడంతో ‘ప్రాణం ఖరీదు’ మూవీలో చిరంజీవి నటించడం ద్వారా ఈ సినిమా ముందుగా విడుదలైంది.

దీని తర్వాత కళా దర్శకుడు బాపు మూవీలో నటించే అవకాశం కూడా వచ్చింది. ఈ విధంగా చిరంజీవి మనవూరి పాండవులు చిత్రంలోని నటించారు. 1975లో బాపు డైరెక్షన్లో మనవూరి పాండవులు మూవీ థియేటర్ లోకి వచ్చింది. ఈ మూవీలో మురళీమోహన్, కృష్ణంరాజు, ప్రసాద్ బాబు, భాను చందర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో గ్రామ పెద్దగా రామ్ గోపాల్ రావు ఆకృత్యాలను అడ్డగించి యువకుడిగా 5 గురు కనిపించారు. ఈ మూవీలో మొదటి సారి అల్లు రామలింగయ్య చిరంజీవితో నటించారు.

 

మంచి కథతో ఈ మూవీ అందరిని ఆకట్టుకుని విజయం సాధించింది. ఈ మూవీని అల్లు రామలింగయ్య కూతురు సురేఖ చూశారు. ఈ మూవీలో పల్లెటూర్లో చిరంజీవి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎవరు ఈ కుర్రాడు సైకిల్ బలే తొక్కుతున్నారని ఆమె మనసులో అప్పుడే అనుకుందట. తర్వాత తన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో విషయాన్ని చెప్పింది. కట్ చేస్తే రెండేళ్లు తిరగకముందే చిరంజీవి సురేఖ పెళ్లి కాయం అయింది. ఈ విధంగా వారు పెళ్లి చేసుకున్నారు.


End of Article

You may also like