రాణా పెళ్లిపై సురేష్ బాబు రియాక్షన్ ఇదే… లాక్ డౌన్ లో మంచి పనే పెట్టారు!

రాణా పెళ్లిపై సురేష్ బాబు రియాక్షన్ ఇదే… లాక్ డౌన్ లో మంచి పనే పెట్టారు!

by Anudeep

Ads

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ రానా ప్రేమ గురించి పెట్టిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. రానా ప్రేమ విషయం కేవలం ప్రేక్షకులకు మాత్రమే సర్ప్రైజ్  కాదు అటు ఇరు కుటుంబ సభ్యులను, క్లోజ్ ప్రెండ్స్ ను , ఇండస్ట్రీ వారిని కూడా షాక్ కి గురయ్యేలా చేసింది..వీరిద్దరి రిలేషన్ పై రానా ఫాదర్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు స్పందించారు..సురేశ్ బాబు మాటలను బట్టి వారి బంధం గురించి మరింత క్లారిటి వచ్చింది.

Video Advertisement

“వారిద్దరి స్నేహం ఇప్పటిది కాదు..కొన్నేళ్లుగా వాళ్లు రిలేషన్లో ఉన్నారు..కానీ సడన్ గా ఇలాంటి నిర్ణయం ప్రకటిస్తారనుకోలేదు.. మొత్తానికి ఇద్దరూ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదిలో పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. డిసెంబర్ లో లేదంటే అంతకుముందే జరగొచ్చు కూడా.  లాక్ డౌన్ వేళ ఏం చేయాలో పాలుపోక ఉన్న మాకు మంచి పని పెట్టారు రానా మిహిక. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజి అయిపోయాం. పెళ్లి ఎప్పుడనేది, ఇతర వివరాలు త్వరలో మీడియాకి వెల్లడిస్తాం అని అన్నారు సురేశ్ బాబు.

సినిమా వాళ్లకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు కనీసం గాసిప్స్ రూపంలో అయినా బయటపడుతూ ఉంటాయి..కాని రానా స్వయంగా ప్రకటించేంతవరకు దగ్గరి వాళ్లకు కూడా తెలియలేదంటే నిజంగా 2020 షాకింగ్ న్యూసే..ఏదేమైతేనేమి భల్లాలదేవ మనసు దోచుకున్న సుందరి ఎవరా అనేది తెలిసిపోయింది.


End of Article

You may also like