Ads
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది..ప్రభుత్వాలు లాక్ డౌన్ ని విధించడం..కావున ప్రతి ఒక్కరికి ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు ఏ దెబ్బ పెద్ద చిన్న అంటూ తేడా లేకుండా..అందరికి ఈ దెబ్బ పడింది.సినిమా థియేటర్ లు మూత పడటం.తిరిగి ఎప్పుడు ప్రారంబిస్తారో ఎవరికీ క్లారిటీ లేకుండా పోవటం తో చేసేది ఏమి లేక విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు OTT ప్లాట్ ఫామ్ బాట పట్టాయి.
Video Advertisement
సినిమాలు విడుదల కాకాకుంటే వాటికి అయిన ఖర్చు..చేసిన అప్పులకి వడ్డీలు ఇవన్నీ తీరాలంటే ఇక నిర్మాతలకి ఒకటే మార్గం ఆన్లైన్ ఓట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా సినిమాని విడుదల చేసి ఎంతో కొంత డబ్బుని కాష్ చేసుకువటం…ఇదే సమస్య సూర్య,జ్యోతికలకు ఎదురయ్యింది సూర్య నిర్మాతగా జ్యోతిక ప్రధాన పాత్రలో ‘పొన్‌మగల్ వందాల్’ సినిమాని నిర్మించారు కానీ విడుదల చేసే సమయానికి లాక్ కారణంగా థియేటర్స్ మూత పడటంతో వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
కానీ థియేటర్ల యాజమాన్యం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది.సూర్య సినిమాలని బ్యాన్ చేస్తాం అంటూ హెచ్చరించారు ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఎలాగోలా విడుదల చేసారు సూర్య.ఈ క్రమం లో చిత్ర పరిశ్రమ నుంచి సూర్యకి అండగా నిలిచారు కొందరు నిర్మాతలు.సినిమా ని చూసిన సినీపరిశ్రమ లోని ప్రముఖులు బాగుందంటూ ట్వీట్స్ చేసారు…కానీ సూర్య జ్యోతికలకు ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు ott ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన కొన్ని గంటలకే పైరసీ చేసుకొని వివిధ సైట్లలోకి ఎక్కించేసారు సదరు సైట్ ఓనర్ లు ఇలా అందరూ అదే పైరసీ చేసిన సినిమానే డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు.దేనితో సూర్య జ్యోతికల కష్టం మొత్తం బూడిద పలు అయ్యింది..ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న పైరసీ ని మాత్రం అరికట్టలేకున్నారు..ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
End of Article