Ads
తాప్సీ పన్ను గురించి తెలుగులో అందరికీ పరిచయమే. తెలుగులో ఝుమ్మంది నాదం సినిమా తోటి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అడపాదడప పలు సినిమాలు చేసింది. అయితే కొన్ని రోజులకి టాలీవుడ్ కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి బాలీవుడ్ చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ.
Video Advertisement
బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకుంది.తాజాగా షారుక్ ఖాన్ డంకీ సినిమాలో మంచి పాత్రలో నటించింది. ఈ సినిమాని దర్శకుడు రాజకుమార్ హీరాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి రిలీజ్ రోజు నుంచి మంచి టాక్ వచ్చింది. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అమ్మడు తన లవ్ స్టోరీ గురించిన విషయాలు బయటపెట్టింది… తన తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ అబ్బాయి స్కూల్లో తన సీనియర్ అట. తను పదో తరగతి చదివేవాడట. మొదట్లో తను కూడా ఆసక్తి చూపించేవాడని తర్వాత తర్వాత చదువు పాడైపోతుందని తనకి దూరంగా వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ప్రేమ పెళ్లి కాకుండా చదువు పైన శ్రద్ధ పెట్టాలని తనకి చెప్పాడని ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంది. ప్రస్తుతం తాప్సి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
End of Article