బాహుబలి సినిమాతో తన టాలెంట్ ని ప్రపంచానికి చూపించిన జక్కన ‘రాజమౌళి’ సినిమా టేకింగ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పరాజయాన్ని చూడలేదు అంటే ఆయన సినిమా మీద చూపించే డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఆయన సినిమాలనోని ఆర్టిస్టులు,టెక్నీషియన్స్ ..ప్రతి ఒక్కరి దగ్గరనుంచి ఎలా అవుట్ ఫుట్ తీసుకువలో బాగా తెలుసు.
కాబట్టే సినిమాలు లేట్ అయినా కూడా ప్రతి ఫ్రేమ్ లో అయన వర్క్ కనబడుతుంది.’బాహుబలి’ వంటి సినిమాకి అయన కేటాయించిన అయిదు సంవత్సరాలు పడ్డ కష్టం ఎలాంటిదో అందరం చూసాము.అటు వంటి బ్లాక్ బస్టర్ తరువాత అయన చేపట్టిన క్రేజీ ప్రాజెక్ట్ ‘RRR ‘ ఇప్పుడు అందరి ద్రుష్టి ఆ సినిమా వైపే ఉంది.కోవిడ్-19 కారణంగా సినిమా షూటింగ్స్ వాయిదా పడటం తో షూటింగ్స్ మరింత జాప్యం అవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 70 శాతం సినిమాని పూర్తి చేసిన జక్కన్న.
ఇప్పుడే మిగితా షూటింగ్ చేసే పని లో నిమగ్నం అయ్యారు.సినిమాని మొదుట జులై 2020 లో విడుదల చేద్దాం అనుకున్నారు.కానీ అది కుదరలేదు ..మళ్ళీ 2021 సంక్రాంతికి వాయిదా వేశారు.షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉండటం.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు ఉండటం తో మళ్ళీ సమ్మర్ కి అనుకున్నారు ఇప్పుడు లాక్ డౌన్ వలన మరింత జాప్యం పెరగడంతో ప్రభుత్వాల నిమయాలు పాటించి అతి తక్కువ మంది ఆర్టిస్టులతో షూటింగ్స్ అంటే మరీ కష్టంగా మారింది,,సినిమా పదే పదే వాయిదాలు పడటం,ఎన్టీఆర్ హీరోయిన్ ని మార్చాల్సి రావడం,సినిమాలో లోని కొద్దీ మంది క్యాస్ట్ విదేశీయులు కావటం తో వారిని విదేశాల నుంచి తీసుకువరావటం అదే ఇలాంటి సమయాల్లో బయటి దేశాల్లో కరోనా వ్యాప్తి ఇంకా అధికంగా ఉంది.మరి ..చాలా కష్టం.ఇవన్నీ దాటుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చెయ్యడం చాలా ఇబ్బందే అని చెప్పాలి.