Rashi Phalalu : This week in Telugu, Horoscope This Week, ఈవారం రాశి ఫలాలు : పన్నెండు రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది తెలుసుకోండి, పరిష్కారాలు పాటించండి అంతా మంచే జరుగుతుంది.
మేష రాశి ఈవారం రాశి ఫలాలు : (జులై 18 – 24)
ఈవారం వీరికి చాలా బాగుంటుంది. మీ అభివృద్ధికి అవసరమైన ప్రణాలికను సిద్ధం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈవారం ధన అభివృద్ధి పుష్కలంగా ఉంది, వ్యాపారవర్గాలవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. శివాలయాలు దర్శించడం, శివువుణ్ణి ధ్యానించడం చాలా మంచిది.
వృషభ రాశి ఈవారం రాశి ఫలాలు : (జులై 18 – 24)
ఈ రాశివారికి ఈవారం అంతా శుభమే జరుగుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనుల్లో పురోగతి చూస్తారు. ఉద్యోగ రంగాలవారికి ఈవారం అనుకూలంగా ఉంది మంచి ఫలితాలను చూస్తారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. ఈరాశి వారు మహావిష్ణువుని ఆరాధదించడం చాలా మంచిది.
మిథునం రాశి ఈవారం రాశి ఫలాలు : (జులై 18 – 24)
వ్యాపారవర్గాలవారు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది, చిన్న పాటి తప్పులు పెద్ద నష్టాలకి దారి తీసే అవకాశం లేకపోలేదు. ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల నుంచి సలహాలు సూచనలు చాలా ముఖ్యం. ఆవేశాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఈ రాశి వారు సూర్యభగవానుడిని ఆరాదిచడం మంచిది.
కర్కాటకం రాశి ఈవారం రాశి ఫలాలు : (జులై 18 – 24)
ఇన్నాళ్ళుగా వేచి చూస్తున్న పనులు పూర్తి చేస్తారు, అపార్థాలకు దూరంగా ఉండండి, వాహన యోగం ఉంది, సంపదను సృష్టించుకుంటారు, పనుల్లో ఓర్పు చాలా అవసరం, ధైర్యంగా ముందగు వెయ్యడం ఉత్తమం, ఆంజనేయస్వామిని పూజించడం చాలా మంచిది.
సింహం రాశి ఈవారం రాశి ఫలాలు : (జులై 18 – 24)
ఈవారం అద్భుతమైన ఫలితాలు చూస్తారు, ధనలాభం చాలా బాగుంది, గత కొద్దీ రోజులుగా వెతుకుతున్నది దొరికే సూచనలు ఉన్నాయి, సమాజంలో మీ గౌరవ మర్యాదలకి ఎలాంటి లోటు లేదు, ఒక శుభవార్త వింటారు, మరిన్ని మంచి ఫలితాలకు ఇష్టదైవాన్ని ఆరాధించండి.
కన్య రాశి ఈవారం రాశి ఫలాలు : (జులై 18 – 24)
ఈవారం అద్భుతమైన ఫలితాలు చూస్తారు, ధనలాభం చాలా బాగుంది, గత కొద్దీ రోజులుగా వెతుకుతున్నది దొరికే సూచనలు ఉన్నాయి, సమాజంలో మీ గౌరవ మర్యాదలకి ఎలాంటి లోటు లేదు, ఒక శుభవార్త వింటారు, మరిన్ని మంచి ఫలితాలకు ఇష్టదైవాన్ని ఆరాధించండి.
తుల రాశి ఈవారం రాశి ఫలాలు: (జులై 18 – 24)
ఉద్యోగ, వ్యాపార రంగాలవారికి ఈ వారం శ్రమ తప్పదు, భూమి, గృహ కొనుగోలుకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి సేవ కారక్రమాల్లో పాల్గొంటారు, బంధు, స్నేహితుల నుంచి మంచి సహకారం లభిస్తుంది.
వృశ్చికం రాశి ఈవారం రాశి ఫలాలు: (జులై 18 – 24)
ఈవారం వృశ్చిక రాశి వారికి ఆటంకాలు తప్పవు, సమస్యకు పరిష్కారాలు వెతుకుతారు, వారం మధ్యలో పరిష్కారం దొరికే సూచనలు ఉన్నాయి, మీ మనోబలమే మిమల్ని కాపాడుతుంది, ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సహం పుష్కలంగా ఉంటుంది, నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రం పఠించడం మంచిది.
ధనుస్సు రాశి ఈవారం రాశి ఫలాలు: (జులై 18 – 24)
మీకు ఈ వారం బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయం, పనులు మొదట నెమ్మదించిన ఓర్పుగా ముందుకు వెళ్ళండి విజయం సాధిస్తారు, మీ ధైర్యమే మిమల్ని కాపాడుతుంది, ఇష్ట దైవాన్ని ఆరాధించడం మంచిది.
Rashi Phalalu This week in Telugu : మకరం రాశి ఈవారం రాశి ఫలాలు: (జులై 18 – 24)
వ్యాపార వర్గాలవారికి ఈ వారం అనుకూలంగా ఉంది, నూతన ప్రయత్నాలు లభిస్తాయి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మరీ మంచిది, ఉద్యోగస్తులకు ఈ వారం కలిసి వస్తుంది, ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది, సూర్యనారాయణున్ని పూజించడం చాలా మంచిది.
Rashi Phalalu This week in Telugu This week in Telugu, Horoscope This Week, ఈవారం రాశి ఫలాలు
Rashi Phalalu This week in Telugu కుంభం రాశి ఈవారం రాశి ఫలాలు: (జులై 18 – 24)
వ్యాపార వర్గాలవారికి ఈ వారం శ్రమ తప్పదు అయినా కూడా మీ కష్టానికి తగ్గ ఫలితాలు సాధిస్తారు, ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం ఉత్తమం, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు అలోచించి అడుగెయ్యడం మంచిది అని చెప్పవచ్చు.
Rashi Phalalu This week in Telugu మీనం రాశి ఈవారం రాశి ఫలాలు: (జులై 18 – 24)
మీ తెలివితేటలతో అనుకున్నది సాధిస్తారు, వ్యాపారవర్గాలవారికి అనుకూలంగా ఉంది, గట్టి నిర్ణయాలతో ముందుకు వెళతారు, ఈ వారం మీరు తీసుకోబోయే కీలక నిర్ణయాల్లో బంధు మిత్రుల సహకారం, సూచనలు ఎంతో ముఖ్యం, మీ ఇష్ట దైవాన్ని పూజించడం శ్రేయస్కరం.
Also read :
బల్లి శాస్త్రం : బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.