ఒక్కసారి ఒకే ఒక్కసారి సోషల్ మీడియా చేతికి చిక్కితే చాలూ..వాళ్లకి బ్రేకిచ్చే వరకు వదిలిపెట్టరు నెటిజన్లు.. నువ్ మంచి చేయ్, చెడు చేయ్, కామెడి పంచు, ఏడిపించు…నువ్ ఏం చేసావనేదానికి సంబంధం లేకుండా ట్రోలింగ్ తో ఊదరగొట్టేస్తారు..ఈ మధ్య కాలంలో అలా ట్రోలింగ్‌లో నానిన పేరు రాహుల్.. కెసిఆర్ ప్రెస్‌మీట్ కోసం ఎంతగా ఎదురు చూసేవాళ్లు, రాహుల్ కోసం కూడా అంతే ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్లు..ఇంతకీ ఈ రాహుల్ ఎవరూ??
కరోనా మొదలైనప్పటి నుంచి సీఎం కెసిఆర్ ప్రెస్‌మీట్ బాగా క్రేజ్ పెరిగిపోయింది.రెండు తెలుగు రాష్ట్రాలు తమ సిఎం కెసిఆరేనా అన్నట్టుగా ఎదురు చూసేవారు..ప్రతి ప్రెస్ మీట్ లో రాహుల్ అనే పేరు రాకుండా ఉండదు. “రాహుల్ ఎందుకయ్యా ఇదంతా..?… రాహుల్ యూ ఆర్ ఏ సచ్ సీనియర్ జర్నలిస్ట్ ఇలా మాట్లాడొచ్చా…, రాహుల్ యూ మస్ట్ రైట్ దిస్.. నువ్ కచ్చితంగా రాయాలే.. అంటూ సీఎం కేసీఆర్ మాటల్లో పదే పదే రాహుల్ పేరు వినపడేది..మనిషి ఎవరో మాత్రం ఎవరికి తెలీదు.. ఈ రాహుల్ ఎవరూ అని తెలుసుకోవాలనే ఆతృత రోజు రోజుకి జనాల్లో పెరిగిపోయింది..
ఇంకేం సోషల్ మీడియాకి ఒక ఫోటో దొరికింది.. దేవులపల్లి రాహుల్ అనే ఓ యంగ్ జర్నలిస్ట్ ఫొటో అది.. ఈయనే రాహుల్ అంటూ తెగ వైరలైంది.. కాని తేలిన అసలు విషయం ఏంటంటే..అసలు ఈ దేవులపల్లి రాహుల్ అనే జర్నలిస్ట్ సిఎం ప్రెస్‌మీట్ కి ఎప్పుడూ అటెండ్ కాలేదని..మరెలా అతను ఇతనవుతాడు…ఇతను మరెవరో అంటూ పట్టువదలని విక్రమార్కుల్లా మళ్లీ రాహుల్ గురించి తెలుసుకోసాగారు..మొత్తానికి ఈ సారి పట్టేసారు.. పట్టేసారు అనేకంటే సోషల్ మీడియాలో ఇంత రచ్చ కంటే ఎవరో, కెసిఆర్ తనని ఎందుకు అలా సంభోదిస్తారో తెలియడం ముఖ్యం అనుకున్నరేమో..మోత్తానికి రాహుల్ సారీ.. సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ గారి పేరు, ఫోటో బయటకు వచ్చాయి.
సిఎం ప్రెస్ మీట్ లో ఉండే రాహుల్ హిందూ దినపత్రికలో పనిచేసే సీనియర్ జర్నలిస్ట్.. కెసిఆర్ ఆయన్ని సంభోదించడానికి గల కారణం ఇద్దరి మధ్య ఉన్న స్నేహమే.. కెసిఆర్ మాత్రమే కాదు ఇప్పటి వరకు తన కెరీర్లో ఎందరో ముఖ్యమంత్రలను చూసిన జర్నలిస్ట్ ఈ రాహుల్..చాలా మంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా మాట్లాడేంత పరిచయం ఉన్న జర్నలిస్ట్. జర్నలిజం కెరీర్లో కొన్నేళ్లు గడవగానే ప్రభుత్వాలు ఆఫర్ చేసే ఏదో ఒక పదవిలో ఇరుక్కుపోయే మనస్తత్వం కాదు రాహుల్ గారిది..ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి,
అందుకే అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి కెసిఆర్ కూడా అలాంటి ఆఫర్స్ చేసినా చాలా సున్నితంగా తిరస్కరించి తన పనేదో తను చూసుకునే వ్యక్తి..అంతే తప్ప ఎవరి ప్రలోభాలకు తలొగ్గకుండా వార్తల్ని వార్తల్లా రాసే నిక్కచ్చి వ్యక్తి..ఇన్ని విషయాలు తెలిసాక కూడా అతడి గురించి ట్రోల్ చేయడం అంటే..ఇక అది ట్రోల్ చేసే వారి విజ్ణతకే వదిలేద్దాం..
Source :: Muchata